దగ్గరుండి ఓడిస్తా: డొనాల్డ్ ట్రంప్‌కు వారెన్ బఫెట్ షాక్

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన వారెన్ బఫెట్.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాకిచ్చారు. డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని, దగ్గరుండి మరీ అతడిని ఓడిస్తానని బఫెట్ తేల్చి చెప్పారు.

నెబ్రాస్కాలో డిమోక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ నిర్వహించిన ప్రచార సభలో వారెన్ బఫెట్ పాల్గొన్నారు. ట్రంప్ వ్యాపార రికార్డును, దివాలా చరిత్రను ఆయన ప్రశ్నించారు. అసలు ట్రంప్ తన ఆదాయపన్ను రిటర్నులను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.

పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేనివారిని తాను దగ్గరుండి తీసుకెళ్తానని కూడా బఫెట్ తెలిపారు. నెబ్రాస్కాలో ఆ రోజు మొత్తం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా 32 సీట్ల ట్రాలీ ఒకదాన్ని రిజర్వు చేసినట్లు చెప్పారు. ట్రంప్ తన కేసినోను, హోటల్ కంపెనీని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజిలో 1995లోనే లిస్ట్ చేశారని, దాంతో మదుపుదారులు తమ పెట్టుబడులు నష్టపోయారని బఫెట్ పేర్కొన్నారు.

Warren Buffett 'to do whatever it takes' to defeat Donald Trump

ఈ ప్రాంతంలోనే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ఓ ముస్లిం - అమెరికన్ కుటుంబం ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో అక్కడ వారికి, ట్రంప్‌కు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఖిజర్, ఘజేలా ఖాన్ దంపతుల కుమారుడు అమెరికా సైన్యంలో పనిచేస్తూ.. 2004లో ఇరాక్‌లో మరణించాడు.

అయితే ఈ కుటుంబ త్యాగాన్ని ట్రంప్ తక్కువ చేసి మాట్లాడారని బఫెట్ మండిపడ్డారు. తటస్థంగా ఉన్న, స్వతంత్రంగా వ్యవహరించే ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారెన్ బఫెట్ సహా మరికొందరు వ్యాపారవేత్తలు గత సంవత్సరమే క్లింటన్‌కు మద్దతు పలికారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Billionaire investor Warren Buffett has said he'll do whatever it takes to defeat Donald Trump, including escorting people to the polls himself.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X