కనిపించుట లేదు: షేక్స్‌పియర్ పుర్రెను ఎత్తుకెళ్లారా?
లండన్: ప్రముఖ నాటక రచయిత షేక్స్‌పియర్ పుర్రెను ఎవరో ఎత్తుకెళ్లినట్లుగా ఉన్నారు. ఇటీవల లండన్ హోలీ ట్రినిటీ చర్చ్‌లో ఉన్న ఆయన సమాధిని పరిశీలించినప్పుడు తమకు.. ఆయన కపాలం లేదని గుర్తించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పారు.
షేక్‌స్పియర్ కపాలం సమాధిలో కనిపించడం లేదన్నారు. స్టాన్‌ఫర్డ్ ఎవోన్స్ హోలీ ట్రినిటి చర్చిలోని షేక్‌స్పియర్ సమాధిని రాడార్ సహాయంతో పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగు చూసిందన్నారు. పద్దెనిమిదవ శతాబ్దంలో షేక్‌స్పియర్ సమాధి దోపిడికి గురైందనే వాదనకు ఈ పరిశోధన బలం చేకూర్చిందన్నారు.

శక్తిమంతమైన పరికరాలతో సమాధిని స్కానింగ్ చేసినప్పుడు షేక్స్‌పియర్ పుర్రె ప్రాంతంలో ఖాళీ ఉందని తేలిందని చెప్పారు. మరోవైపు, దీనిని హోలీ ట్రినిటీ చర్చి పెద్దలు మాత్రం కొట్టి పారేస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి వదంతులు సరికాదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications