
VIRAL VIDEO:వామ్మో.. సింహం పిల్లలతో ఆటలు, ఏం చేసిందంటే, వైరల్
పులులు, సింహాలు అన్న ప్రతీ ఒక్కరికీ భయమే.. అవీ పిల్లలు అయినా అంతే మరీ.. అయితే ఒకతను సింహం పిల్లలతో ఏంచక్క ఆడారు. దానిని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. కొద్దీ సెకన్లే ఉన్న ఆ వీడియోలో రెండు సింహం పిల్లలు ఉన్నాయి. మీరు కూడా ఓ సారి తిలకించండి. చూసి ఆశ్చర్యపోయడం ఖాయం.

కొండ చిలువలు కూడా పెట్సే..
ఇప్పుడు పిల్లులు, కుక్కలే కాదు.. కొండ చిలువలు, రెండు తలల పాము, తాబేళ్లను కూడా తమ ఇంటి వద్ద పెంపుడు జంతువులు పెంచుకుంటున్నారు. అదేమంటే.. మంచిది, కలిసి వస్తోందని అంటున్నారు. కానీ సింహం, పులులతో ఆటలు మాత్రం వద్దు.. ఎందుకంటే అవీ క్రూర జంతువులు.. కానీ ఆ వీడియో చూస్తే మీరు మాత్రం నమ్మశక్యంగా ఉండరు. అవును నిజమే.. సింహం పిల్లలతో ఒకతను స్టిల్ ఇచ్చాడు. వాటి తలపై నిమురుతూ ఫోజు కొట్టారు. అయినప్పటికీ ఒకటి మెల్లిగా ఉంది. అలానే చేయడంతో.. గాండ్రించినంత పనిచేసింది.

కారుపై సింహం పిల్లలు
ఆ వీడియోను బాసిత్ ఆయాన్ అనే యూజర్ షేర్ చేశారు. వీడియోలో సింహం పిల్లలు కారుపై కూర్చొని ఉన్నాయి. వాటి వద్ద ఒకతను ఉన్నాడు. వాటిని నిమరగా ఒకటి కోపంగా చూసింది. దీంతో అతను వెనకడుగు వేశాడు. కరిచినంత పనిచేసినా.. తిరిగి వాటి దగ్గరకు అతను వెళ్లాడు. అవీ కారు రూఫ్ ఎక్కబోయాయి. గత నెలలో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోకు 2.74 లక్షల లైకులు వచ్చాయి. 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కామెంట్ సెక్షన్ నిండిపోయింది.
బీకేర్ ఫుల్
చాలా మంది దానితో అలా చేయొద్దని అంటున్నారు. ఇదీ మంచి పద్దతి కానే కాదని అన్నారు. ఇదీ చాలా డేంజరస్ అని.. మరోసారి ఇలా ట్రై చేయొద్దని సూచించారు. పులి, సింహం, చిరుత అనేవి కూృర జంతువులు అని.. పెంపుడు జంతువులు కాదని అంటున్నారు. సో.. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. లేదంటే వాటి బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.