
viral video:హోటల్ గదిలో నిద్రలో మహిళ.. కిటికీల్లోంచి అనుకొని అతిథి, వెకప్ కాల్..
హోటల్‌లో ఉంటే.. సర్వీస్ బాయ్ ఏం కావాలి అని అడుగుతుంటారు. ఊరికే చిరాకు తెప్పిస్తారు.. అనే వారు ఉన్నారు. అయితే వారు కూడా ఇతర సర్వీస్ చేస్తే.. అదే కోతి, పప్పీ లేదంటే.. ఏనుగు..అవును గజరాజు సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది. భయపడేవారు అయితే ఎగిరి గంతేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం అలానే ఉంది. ఏం జరుగుతుందో అనుకుంది. కొన్ని సెకన్ల పాటు ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

మహిళ పడుకొని ఉండగా..
థాయ్‌లాండ్‌లో గల చియాంగ్ మై రిసార్ట్‌లో ఓ మహిళ పడుకుని ఉంది. అయితే పక్కనే ఓ కిటికీ ఉంది. చల్లగా గాలి వీస్తూ ఉంటుంది. కానీ అంతలోనే కిటికీ నుంచి ఓ గజరాజు వచ్చాడు. తొండం తీసి.. ఊపి వేశాడు. మెల్లగా ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. తనను ఎవరో లేపుతున్నారని గ్రహించింది. లేచి చూసింది. ఆ ఏనుగును చూసి అలానే ఉంది. వీడియోను కంటెంట్ క్రియేటర్ సాక్షి జైన్ పోస్ట్ చేశారు. దానికి ఆమె రిసెప్షనిస్ట్ బదులు ఎలిఫెంట్ వేకప్ కాల్ ఇస్తోందని రాశారు.
ఎలిఫెంట్ సర్వీస్
ఇక్కడ సర్వీస్ చేసే వారు ఏం కావాలి, ఏం తీసుకురమ్మంటారు అనే బదులు.. ఏనుగే లేపుతుందని రాశారు. నిజమే.. ఆ ఏనుగు సర్వీస్ చేసింది. వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2.20 లక్షల లైకులు కొట్టారు. చాలా మంది వివిధ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. ఆ మహిళ మెస్మరైజింగ్ చేశారని రాశారు.

డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్
ఇదీ వింత అనుభవం అని ఒకరు రాశారు. ఇలాంటి జ్ఞాపకాలను మరచిపోలేం అని మరొకరు రశారు. ఇదీ చాలా బ్యూటిఫుల్ అని మరొకరు.. ఆ సమయంలో తాను అక్కడ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. వెంటనే పారిపోయేవాడినని చెప్పారు. మరో క్షణం అక్కడ ఉండేవాడిని కాదని చెప్పారు. తాను అయితే పండుకునేవాడిని కాదని మరొకరు రాశారు. ఇలా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.