
VIRAL:ఇదేంది మాస్క్.. ట్విట్టర్ ఆఫీసులో సింక్ తీసుకొని వస్తూ, వైరల్
టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్నారు. తనకు సంబంధించి అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో గల ట్విట్టర్ ఆఫీసులో సింక్ తీసుకెళుతున్నాడు. ఆ వీడియోను పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్ల కామెంట్లతో కామెంట్ బాక్స్ నిండిపోతుంది.
ఆ సింగ్ తీసుకెళుతోన్న వీడియో నెటిజన్లు షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మాస్క్ కొనుగోలు చేయనున్నారు. ఈ డీల్ శుక్రవారం నాటికి క్లోజ్ చేయాలి. కానీ అమెరికాలో గల ట్విట్టర్ కార్యాలయానికి మాత్రం మాస్క్ వచ్చేశారు.

డీల్ క్లోజ్ చేయడానికే మాస్క్ ఆఫీసుకు వచ్చి ఉంటారని ట్విట్టర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్ తెలిపారు. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరాయి. ఇంతలో సింక్ తీసుకొని అతను రావడం చర్చకు దారితీసింది. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటి ఇలా అంటూ.. సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ సింక్ అతనికి సెంటిమెంట్ అయి ఉంటుంది. అందుకే తీసుకొచ్చి ఉంటారు.
ట్విట్టర్‌లో 75 శాతం ఉద్యోగులను తొలగించాలని మాస్క్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై అధికారికంగా ఏ విషయం తెలియలేదు. కీలకమైన పోస్టుల్లో ఉన్నవారికి మాత్రం థ్రెట్ ఉంటుంది. ట్విట్టర్ కొనుగోలు చేయడానికి మాస్క్ బ్యాంకుల నుంచి 12.5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంటున్నారు. ఏప్రిల్‌లో టెస్లా స్టాక్స్ 15 బిలియన్ డాలర్లు సేల్ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ కొనుగోలు కోసం నిధులు సమకూర్చడానికి ఈక్విటి ఒప్పందాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. కానీ ఆఫీసులోకి సింక్ ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఆ వీడియో మాత్రం ట్రోల్ అవుతుంది.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022