వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా కొత్త వెబ్‌సైట్లో భూభ్రమణం చూడొచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: నాసా కొత్త వెబ్ సైట్‌లో భూభ్రమణం చూడవచ్చు. భూభ్రమణం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే, భూమి ఎలా తిరుగుతుంది.. సూర్య ప్రకాశమంతమైన గుండ్రని భూఆకారం ఎలా ఉంటుందనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలంటే నాసా కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను చూసి తెలుసుకోవచ్చు.

ప్రతిరోజు భూమి తిరిగే దిశ, దశలు తెలిపే చిత్రాలున్న వెబ్‌సైట్‌ను నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించింది. ఎర్త్ పోలిక్రోమాటిక్ ఇమేజింగ్ కెమెరా (ఎపిక్) తీసే చిత్రాలను రోజుకోసారి డజన్‌కు పైగా తీసే ఇమేజ్‌లను నాసాకు చెందిన ఈ సంస్థ పోస్ట్ చేస్తుంది.

Watch how the Earth rotates on NASA's new website

పాత చిత్రాలను వెతుక్కునే విధంగా తేదీల వారీగా, సమాచారంతో కూడిన ఆర్కైవ్స్ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. లక్షల మైళ్ల దూరంలో ఉన్న డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ (డిస్కవర్)పై చిత్రాలను తీయడానికి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ), యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌తో ఒప్పంద భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

నాలుగు మెగాపిక్సెల్ చార్జ్ కపుల్ డివైస్ (సీసీడీ) కెమెరా, టెలిస్కోప్ సదుపాయమున్న ఎపిక్ కెమెరాతో తీసిన చిత్రాలు కేవలం పదిహేను కిలో మీటర్ల దూరంలో నుంచి తీసినట్లు ఉంటాయని, ఈ చిత్రాలు 12 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న ఫొటోగ్రాఫిక్ కెమెరాతో తీసిన చిత్రాలకు సమానమని డిస్కవర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఆడం జాబో తెలిపారు. తక్కువ కాల వ్యవధి (100 మిల్లీసెకన్లు)లోనే చిత్రాలను ఎపిక్ కెమెరా బంధించడం వల్లా భూమికి వెనుక వైపున ఉన్న నక్షత్రాలు కనిపించడం లేదన్నారు.

English summary
NASA has launched a new website where you can see images of the full, sunlit side of the Earth as it rotates every day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X