సూపర్బ్: మోడీ డ్రమ్స్ వాయిస్తే ఇలానే(వీడియో)

Subscribe to Oneindia Telugu

టాంజానియా: ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం టాంజానియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కాసేపు సరదాగా డ్రమ్స్ వాయించారు.

స్టేట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో టాంజానియా అధ్యక్షుడు జాన్‌ పొంబె జొసెఫ్‌ మగుఫులితో కలిసి మోడీ అక్కడి సంప్రదాయ డ్రమ్స్‌ అద్భుతంగా వాయించారు. జాన్‌ కాసేపు డ్రమ్స్‌ వాయించి ఆపేసినప్పటికి మోడీ ఉత్సాహాన్ని చూసి.. తిరిగి కొనసాగించారు. దీంతో అక్కడున్న వారిలో నవ్వులు పూశాయి. అంతేగాక, డ్రమ్స్ వాయించడం ఆపేశాక అక్కడున్న వారందరూ అభినందనగా పెద్దగా చప్పట్లు చరిచారు.

పర్యటనలో భాగంగా జాన్‌తో కలిసి ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధమైన అంశాలపై చర్చించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పలు ఒప్పందాలు కూడా ఇరుదేశాల మధ్య కుదిరాయి.

టాంజానియాతో వాణిజ్యపరమైన సంబంధాలు పెరుగుతున్నాయని మోడీ చెప్పారు. అనంతరం టాంజానియాలోని భారతీయులతో మోడీ భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీ అక్కడి నుంచి కెన్యా బయలుదేరుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi, who on Sunday, July 10, reached Tanzania on the third leg of his four-nation tour of Africa, enthralled Tanzanians with his drumming skills.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి