దాడిని అడ్డుకోలేకపోయాం, క్షమించండి ,శ్రీలంక
బాంబుల దాడి సమయంలో నిఘావర్గాలు హెచ్చరించిన పట్టించుకోని శ్రీలంక ప్రభుత్వం చివరకు క్షమాపణ చెప్పి ,వదిలేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు చేస్తారని నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించాయని అయితే వాటిని అడ్డుకోలేక పోయామని ,దాడులను అడ్డుకోవడంలో వైఫల్యం చెందామని శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు కోరింది. కాగా ఈస్టర్ పండగ దిననా చర్చిలు, హోటళ్లతోపాటు పలు టూరిస్టు స్పాట్స్ లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో 310 మంది చనిపోయినట్టు వార్తలు వెలువడగా వందలాది మంది గాయపడ్డారు.

ఈనేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వ ప్రతి నిధి సేనరత్నే ,ఈ దారుణ ఘటనపై చింతిస్తున్నాం. భాదితుల కుటుంబాలకు ,సంస్థలుకు ప్రభుత్వం తరుపున క్షమాపణలు చెప్తున్నాం అంటూ ఓ ప్రకటనలో పేర్కోన్నారు. కాగా బాదిత కుటుంభాలకు నష్టపరిహారం చెల్లిస్తామని అందులో పేర్కోన్నారు.












Click it and Unblock the Notifications