Coronavirus: 2009 నాటి కన్నా గడ్డు పరిస్థితి, 80 దేశాలు సాయం కోరాయి: ఐఎంఎఫ్ చీఫ్...
కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను గడగడలాడించడమే కాదు ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. మహమ్మారి వల్ల అన్నిరంగాలు కుదేలైపోయాయి. మళ్లీ మాంద్యం మొదలైంది. 2009 నాటి కంటే పరిస్థితి దారుణంగా తయారైందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధినేత్రి క్రిస్టాలినా జార్జివా తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మాంద్యంలోకి వెళ్లిపోయామని స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు.

83 బిలియన్ డాలర్లకు పైగా మూలధనం కలిగిన అభివృద్ది చెందిన దేశాలు మార్కెట్లను ఎదుర్కొగలవని ఆమె తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యవసరంగా 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే 80 దేశాల ఐఎంఎఫ్‌ను సాయం చేయాలని కోరాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఆయా దేశాల సొంత నిల్వలు, దేశీయ వనరులు సరిపోవు అని తెలుసు అని జార్జివా పేర్కొన్నారు.
Recommended Video
అత్యవసర సౌకర్యాలు ప్రస్తుత స్థాయి నుంచి 50 బిలియన్ డాలర్ల పెంచాలని ఆమె కోరారు. ప్రస్తుత తరుణంలో అమెరికా సెనెట్ 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని స్వాగతించారు. దేశంలో ఆర్థికరంగం కుదేలు కావడానికి వీలులేకుండా, అమెరికా చేపట్టిన మంచి చర్య అని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications