మ్యాజిక్ ఫిగర్ సాధించారు: రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్!
వాషింగ్టన్: 'అమెరికా అధ్యక్షుడు కావాలన్నది నా కల' ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య. ఆ దిశగా తొలి అడుగు ముందుకు పడింది. అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలబడటానికి రిపబ్లికన్ పార్టీ పరంగా అవసరమైన మ్యాజిక్ నెంబర్‌ను చేరుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల నుంచి కావాల్సిన మద్దతు పొంది నామినేషన్‌కు అర్హత సాధించారు. ఈ మేరకు ఇప్పటిదాకా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించిన ఆయన పార్టీ టికెట్ చేజిక్కించుకునేందుకు అవసరమైన డెలిగేట్ల మద్దతు కూడా సంపాదించారు.

పార్టీ తరఫున ఆయన అధ్యక్ష బరిలో నిలబడటానికి 1237 మంది డెలిగేట్ల మద్దతు అవసరం కాగా.. గురువారం నాటికి 1238 మంది మద్దతు సాధించారని, వీరిలో 1150 మంది ప్లెడ్జ్‌డ్ సభ్యులు కాగా, 88 మంది అన్‌బౌండెడ్ డెలిగేట్లని వివరించింది. వచ్చే నెలలో జరగనున్న నేషనల్ కన్వెన్షన్‌లో తాము ట్రంప్‌కే మద్దతిస్తామని 88 మంది అన్‌బౌండెడ్ సభ్యులు పేర్కొన్నట్టుగా అసోసియేటెడ్ ప్రెస్ వివరించింది.
ఇక ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలోకి దిగే టికెట్‌ను అందుకోవడమే ఆలస్యం. కాగా, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలు, ఆయన విధానాలు ప్రపంచ నేతలను గందరగోళానికి గురిచేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
వాషింగ్టన్‌లో ఆయన మాట్లాడుతూ అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో అడుగుపెట్టడం అంటే రియాలిటీ షోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష పదవి అంటే రియాలిటీ షోలో పాల్గొనడం లాంటిది కాదని హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడి కోసం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తొలి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications