Gautam Adani: అదానీ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ అదేనా ?
భారత్ లో సోలార్ ప్రాజెక్టుల కోసం ఇక్కడి ప్రభుత్వాలకు 2 వేల కోట్ల మేర లంచాలు ఇచ్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతం అదానీ మరో ఏడుగురు ఇప్పుడు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. అమెరికా కోర్టులో నమోదైన ఈ అభియోగాల విషయంలో చట్ట పరంగా ముందుకెళ్తామని ఇప్పటికే అదానీ గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అదానీ తీసుకునే స్టెప్ ఏంటన్న చర్చ జరుగుతోంది.
అమెరికా చట్టాల ప్రకారం డిఫర్డ్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్స్ (డీపీఏలు) లేదా నాన్-ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్స్ (ఎన్పీఏలు ) ద్వారా లంచం కేసుల్లో సెటిల్మెంట్లను అనుమతిస్తాయి. దీంతో సోలార్ ప్రాజెక్టులకు లంచం కేసులో గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే న్యాయ ప్రక్రియ మొదలైన తర్వాత వీరు సెటిల్మెంట్ ద్వారా ఈ వివాదం పరిష్కరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విదేశీ అవినీతి పద్ధతుల చట్టం (ఎఫ్సీపీఏ) కింద ఐదు రకాల నేరారోపలు వీరిపై నమోదయ్యాయి. బిలియన్ల నిధులను పొందేందుకు అమెరికా పెట్టుబడిదారులను, సంస్థలను తప్పుదారి పట్టించడంపై ఈ ఆరోపణలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో గౌతం అదానీ నికర ఆస్తుల విలువ నుండి 12 బిలియన్ల డాలర్ల మేర ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయింది. 17 శాతం తగ్గి ప్రస్తుతం 57.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సెటిల్మెంట్ ద్వారా అదానీ, ఇతరులు ఈ వివాదం పరిష్కరించుకునే అవకాశమన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications