సింధు ఒప్పందం రద్దు చెల్లదన్న ఆర్బిట్రేషన్ కోర్టు-భారత్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?
కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో ఉన్న సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పదే పదే భారత్ ను కోరిన పాకిస్తాన్ చివరకు నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం కోసం అంతర్జాతీయ కోర్టు తరహాలోనే ఈ మధ్యవర్తిత్వ కోర్టు కూడా పనిచేస్తోంది. దీంతో తాజాగా ఈ కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
హేగ్ లోని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు (పీసీఏ) తాజాగా సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా లేదా శాశ్వతంగా నిలిపేసే అధికారం భారత్ కు లేదని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం దీన్ని ఏకపక్షంగా ఏ దేశం కానీ నిలిపేసే అధికారం లేదని తెలిపింది. అలాగే భారత్, పాకిస్తాన్ పరస్పర అంగీకారంతో ఒప్పందం ముగిసే వరకు ఇది అమలులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఒప్పందం లక్ష్య, ఉద్దేశ్యం దృష్ట్యా ఈ ఒప్పందం యొక్క నిబంధనలు, ఏకపక్షంగా వ్యవహరించే, కొనసాగుతున్న వివాద పరిష్కార ప్రక్రియను నిలిపివేయడానికి లేదా నిలిపివేయడానికి ఏ పక్షాన్ని అనుమతించవని కోర్టు తెలిపింది. ఎందుకంటే అలా చేయడం వలన ఒప్పందం యొక్క తప్పనిసరి మూడవ పక్ష వివాద పరిష్కార ప్రక్రియ యొక్క విలువ, ప్రభావాన్ని ప్రాథమికంగా దెబ్బతీస్తుందని తెలిపింది. కోర్టు విచారణల సమయంలో అంతర్జాతీయ చట్టం ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎలా వర్గీకరించబడిందో లేదా సమర్థించబడిందో సంబంధం లేకుండా సింధు జలాల ఒప్పందం ఏకపక్షంగా నిలిపివేయడానికి భారత్ కు అధికారం లేదని స్పష్టం చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా పాకిస్తాన్ మాత్రం స్వాగతించింది.

అయితే అంతర్జాతీయ స్దాయిలో వివిధ దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి పనిచేస్తున్న శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు భారత్ సిద్ధంగా లేదు. అసలు ఈ కోర్టును తాము గుర్తించడం లేదని నిన్న ఈ ఆదేశాలు వెలువడగానే భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది. అయితే గతంలోనూ 2013లో ఇలాగే భారత్ సింధు నదీ జలాల ఒప్పందం అమలు విషయంలో పీసీఏ ఆదేశాలను పట్టించుకోలేదు. అప్పుడు కూడా సింధు నదీ జలాలపై తమకే హక్కు ఉందని, కాశ్మీర్ లోని రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు కిషన్ గంగ, రాటిల్ విషయంలోనే ఈ వివాదం తలెత్తింది. అప్పుడు కూడా పీసీఏ ఆదేశాలను భారత్ పట్టించుకోకపోవడంతో, దీంతో తమకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది.
పీసీఏ నిబంధనల ప్రకారం తాజాగా సప్లిమెంటరీ అవార్డు పేరుతో ఇచ్చిన ఉత్తర్వులు కోర్టు లేదా ట్రిబ్యునల్ తన ప్రాథమిక నిర్ణయం తర్వాత జారీ చేసే అదనపు తీర్పు అని చెబుతున్నాయి. సాధారణంగా పూర్తిగా పరిష్కరించబడని నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి లేదా ఒక ఒప్పందం లేదా ఒప్పందం యొక్క అధికార పరిధి, సామర్థ్యం లేదా వివరణ వంటి కొన్ని అంశాలను స్పష్టం చేయడానికి జారీ చేస్తారని తెలుస్తోంది. కాబట్టి భారత్ దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో తేల్చుకునే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications