వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీనికి అర్థం ఏమిటి: నెటిజన్లకు ట్రంప్ మెదడుకు మేత

సంచలన వ్యాఖ్యలు, ప్రకటనలు, హామీలతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ ట్వీట్‌తో అందరి మెదళ్లకు పదును పెడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సంచలన వ్యాఖ్యలు, ప్రకటనలు, హామీలతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ ట్వీట్‌తో అందరి మెదళ్లకు పదును పెడుతున్నారు.

ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పటికే ట్విట్టర్లో పలుమార్లు తప్పుగా రాసిన ట్రంప్.. తాజాగా మరోసారి అదే పొరపాటు చేశారు. అయితే ఈసారి మెదళ్లకు పదును పెట్టారు.

తలలు పట్టుకుంటున్న నెటిజన్లు

తలలు పట్టుకుంటున్న నెటిజన్లు

అయితే ఈసారి మాత్రం ట్రంప్ ఉపయోగించిన పదానికి అర్థమేమిటో తెలియక తలలు పట్టుకోవడం నెటిజన్ల వంతైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రంప్‌ మీడియా గురించి ఓ ట్వీట్‌ చేశారు.

ఈ పదానికి అర్థం ఏమిటి?

ఈ పదానికి అర్థం ఏమిటి?

అందులో 'covfefe' అనే పదాన్ని రాశారు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటికే వేలాది మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. అయితే ఆ పదానికి అర్థమేంటో మాత్రం తెలియక నెటిజన్లు తల పట్టుకుంటున్నారు.

ట్రంప్ ట్వీట్‌పై సెటైర్లు

ట్రంప్ ట్వీట్‌పై సెటైర్లు

కొందరు అది కాఫీ అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే డిక్షనరీని వెతుకుతున్నారట కూడా. అయితే కవరేజ్ అని రాయడానికి బదులు అలా రాశారు కావొచ్చునని అంటున్నారు.

అలా చెప్పేందుకా?

గత కొన్ని రోజులుగా మీడియా పట్ల విముఖంగా ఉన్న ట్రంప్‌ ట్విటర్‌లో తన అభిపాయాన్ని పంచుకున్నారు. మీడియా నుంచి స్థిరంగా ప్రతికూలత ఉన్నప్పటికీ అని చెప్పే సమయంలో.. coverageకి బదులుగా పొరబాటుగా covfefe అని రాసి ఉంటారంటున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యం మాత్రం వైరల్ అయింది.

English summary
Puzzling tweet by US president late at night leads, naturally, to madness on the internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X