వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Suez Canal చరిత్ర ఏంటి.. నౌక చిక్కుకుపోవడంతో గంటకు ఎన్ని వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది..?

|
Google Oneindia TeluguNews

గత కొద్ది రోజులుగా సూయెజ్ కెనాల్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఈ కెనాల్‌లో భారీ నౌక చిక్కుకుపోవడంతో ఈ మార్గం ద్వారా జలరవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో గంటకు కొన్ని వేల కోట్ల రూపాయల వాణిజ్యం మరుగున పడుతోంది. సూయెజ్ కెనాల్‌లో చిక్కుకున్న భారీ నౌకను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన చాలా నౌకలు వెనక్కు మరలుతున్నాయి. యూరోప్-ఆసియా దేశాలను కలిపే ఈ ప్రధాన జలమార్గంలో భారీ నౌక చిక్కుకుపోవడంతో వాణిజ్య పరంగా ఆయా దేశాలు ఇబ్బందులతో పాటు నష్టాలను చవిచూస్తున్నాయి. ఒకసారి ఈ సూయెజ్ కెనాల్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

ఐరోపా-ఆసియా దేశాలను కనెక్ట్ చేసే సూయెజ్ కెనాల్

ఐరోపా-ఆసియా దేశాలను కనెక్ట్ చేసే సూయెజ్ కెనాల్

ఈజిప్టులో ఉన్న ఈ సూయెజ్ కెనాల్ ఐరోపా-ఆసియా దేశాలను కనెక్ట్ చేస్తుంది. 1859 నుంచి 1869 మధ్య మధ్యదరా సముద్రం మరియు ఎర్ర సముద్రంను కలుపుతూ ఈ సూయెజ్ కెనాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం-పాశ్చాత్య పసఫిక్ మహాసముద్రంలను కలుపుతూ నిర్మించిన ఈ సూయెజ్ కెనాల్... నిత్యం రద్దీగా ఉంటుంది. పైన పేర్కొనబడ్డ మహాసముద్రాల నుంచి ఆఫ్రికాలోని కేప్‌ ఆఫ్ గుడ్ హోప్‌కు చేరుకునేందుకు దాదాపుగా 7వేల కిలోమటర్లు మేరా దూరం సూయెజ్ కెనాల్ ద్వారా తగ్గుతుంది. గత 150 ఏళ్లుగా ఎప్పుడు ఇలాంటి ప్రమాదం ఒకటి జరగలేదు. అయితే ఆర్థికపరమైన, సాంకేతికపరమైన, రాజకీయపరమైన అంశాలతో గతంలో ఐదు సార్లు సూయెజ్ కెనాల్ బంద్ అయ్యిందే తప్ప ఇలా ఒక నౌక చిక్కుకుని మూసుకున్న దాఖలాలు లేవు. జూన్ 1975కు ముందు ఎనిమిదేళ్లు ఈ కెనాల్‌ను మూసివేయడం జరిగింది.

 కెనాల్ నిర్మాణం ఎలా జరిగింది

కెనాల్ నిర్మాణం ఎలా జరిగింది

ఈజిప్టు ఫరో మూడవ సెనాస్‌రెట్ (1887-1849) పాలనలో సూయెజ్ కెనాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది రాజులు తమ పాలనలో ఈ సూయెజ్ కెనాల్‌కు మరమత్తులు చేయడం ఆపై దాని పొడవును పెంచడం వంటివి చేశారు. 300 ఏళ్ల క్రితం సూయెజ్ కెనాల్‌ నిర్మాణంలో వేగం పుంజుకుంది.ఐరోపా - ఆసియా దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించేందుకు ఈ సూయెజ్ కెనాల్ ప్రధాన వనరుగా మారింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతంలో సూయెజ్ కెనాల్ కీలకంగా మారింది. 1799లో నెపోలియన్ కూడా ఈ కెనాల్‌ను నిర్మించాలని తలపెట్టినప్పటికీ కొలతల్లో తేడా రావడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. 1800 మధ్యలో ఫ్రెంచి ఇంజినీర్ మరియు దౌత్యవేత్త ఫెర్డినెండ్ డీ లెస్సెప్స్ కెనాల్ నిర్మాణంకు మద్దతు ఇవ్వాలని అప్పటి ఈజిప్ట్ వైస్రాయ్ పాషాను కోరారు.

 యూనివర్శల్ సూయెజ్ షిప్ కెనాల్ కంపెనీకి బాధ్యతలు

యూనివర్శల్ సూయెజ్ షిప్ కెనాల్ కంపెనీకి బాధ్యతలు


1858లో కెనాల్ నిర్మాణ బాధ్యతలను యూనివర్శల్ సూయెజ్ షిప్ కెనాల్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. 99 ఏళ్ల పాటు ఆ కంపెనీనే ఆపరేషన్స్ నిర్వహించుకోవచ్చని ఆ తర్వాత ఈజిప్ట్ ప్రభుత్వం కెనాల్‌ను అధీనంలోకి తీసుకుంటుందనే ఒప్పందం జరిగింది. బ్రిటీష్ మరియు టర్కీ పాలకులు ఈ కెనాల్‌కు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ... చివరికి 1869లో కెనాల్ వాణిజ్య అవసరాలకోసం ప్రారంభమైంది. ఈ కెనాల్ కంపెనీలో ఫ్రెంచ్ మరియు బ్రిటీషర్లు అత్యధిక వాటాలు కలిగి ఉన్నారు. ఇక బ్రిటీషర్లు కెనాల్‌పై కన్నేయడంతో 1936 ఒడంబడిక ప్రకారం కెనాల్ వెంబడి తమ బలగాలను మోహరింపజేశారు. 1954లో ఈజిప్టు దేశస్తుల నుంచి ఒత్తిడి రావడంతో ఈజిప్టు - బ్రిటీష్ దేశాల మధ్య ఏడేళ్ల పాటు ఒప్పందం కుదిరింది. అనంతరం బ్రిటీషర్లు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి.

ఈజిప్ట్ పై దండెత్తిన యూకే-ఫ్రాన్స్

ఈజిప్ట్ పై దండెత్తిన యూకే-ఫ్రాన్స్


1956 అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ నాసర్ సూయెజ్ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత నైల్ నదిపై డ్యామ్ నిర్మాణం చేపట్టాలని భావించారు. దీంతో యూకే- ఫ్రాన్స్ మరియు ఇజ్రాయిల్ కలిసి ఈజిప్ట్‌పై దాడులు చేశాయి. దీంతో సూయెజ్ సంక్షోభం ఏర్పడింది. ఇక ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడంతో ఈ సంక్షోభంకు తెరపడింది.తొలిసారిగా శాంతి కోసం ఐక్యరాజ్యసమితి తమ బలగాలను మోహరించింది.ఈజిప్ట్ -ఇజ్రాయిల్ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి సీనాయి ప్రాంతం వద్ద బలగాలను మోహరింపజేసింది.1967లో ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ సీనాయి ప్రాంతం నుంచి ఐక్యరాజ్యసమితి బలగాలు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఇజ్రాయిల్ దేశం సీనాయి ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకోగా ఇందుకు బదులుగా ఈజిప్టు సూయెజ్ కెనాల్‌ను మూసివేసింది.1975వరకు కెనాల్‌ను ఈజిప్టు మూసివేసింది.ఆ తర్వాత రెండు దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాక తిరిగి కెనాల్ తెరుచుకుంది. అనంతరం అరబ్ ఇజ్రాయిల్ మధ్య 1973లో యుద్ధం జరిగినప్పుడు కెనాల్ కేంద్ర బిందువుగా మారింది. అరబ్‌ దేశానికి ఈజిప్టు సిరియా దేశాలు మద్దతుగా నిలిచాయి.

 గంటకు 2వేల కోట్లు నష్టం.. వాణిజ్యంకు బ్రేక్

గంటకు 2వేల కోట్లు నష్టం.. వాణిజ్యంకు బ్రేక్

ఇక ఈ కెనాల్ తిరిగి తెరుచుకున్నప్పటి నుంచి ప్రధాన జలరవాణాకు ప్రధాన మార్గంగా నిలిచింది. పాశ్చాత్య - తూర్పు దేశాల మధ్య ఏటా 10శాతం వాణిజ్యం ఈ జలమార్గం గుండానే జరుగుతోంది. రోజుకు సగటున 50 నౌకలు దాదాపు 9.5 బిలియన్ డాలర్ల మేరా విలువ చేసే వస్తువులను ఈ మార్గం ద్వారానే చేరవేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ నుంచి ఇతర ప్రధాన వస్తువులను ఈ జలమార్గం ద్వారా నౌకలు ఆయా దేశాలకు చేరవేస్తున్నాయి. మార్చి 23వ తేదీన వాతావరణం సహకరించకపోవడంతో ఓ భారీ నౌక చిక్కుకుపోయింది. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు సరుకుతో బయలు దేరిన ఎంవీ ఎవర్ గివెన్ అనే ఈ భారీ నౌక చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 200 నౌకలు ఎక్కడికక్కడే లంగరేశాయి. దీంతో ప్రపంచదేశాల మధ్య వాణిజ్యంకు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ భారీ నౌకను తొలగిస్తే తప్ప వాణిజ్యం తిరిగి గాడిలో పడేలా కనిపించడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆయిల్ సప్లయ్ లేక వాటి ధరలు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
After the Ship had stuck in the Suez canala netizens are searching for the history of Suez canal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X