• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

నేను బ్రిటన్‌లోని లీడ్స్‌ నగరంలో ఉంటాను. నాకు సొంతిల్లు ఉంది. వన్-బెడ్ రూం ఫ్లాట్. చిన్నదే అయినా బాగుంటుంది. ప్రతి బుధవారం స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడతాను. తర్వాత వారితో కలిసి సరదాగా బీర్ తాగుతాను. నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఒక చారిటీ రైడ్‌లో భాగంగా నిరుడు లండన్ నుంచి పారిస్‌కు సైకిల్‌పై వెళ్లాను. చాలా వరకు వారాంతాల్లో సైక్లింగ్‌ చేస్తుంటాను. ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు సూట్ వేసుకుంటాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు నేను మామూలుగానే ఉన్నట్లు కనిపిస్తాను. కానీ వాస్తవానికి నేను మామూలుగా లేను.

నేను 'అనార్గాస్మియా' అనే సమస్యతో బాధపడుతున్నాను. ఇదో సెక్సువల్ డిజార్డర్. సెక్స్‌లో ఎంత ఉద్దీపన కలిగినా భావప్రాప్తి కలగకపోవడమనే సమస్యను అనార్గాస్మియా అంటారు. ఇదో అరుదైన సమస్య.

పురుషుల్లో దాదాపు 25 శాతం మందికే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి భావప్రాప్తి కలుగుతోందని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

అనార్గాస్మియాకు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, పురుషాంగానికి దగ్గర్లో ఉండే ప్రొస్టేట్ సంబంధ శస్త్రచికిత్సలు లాంటి శారీరక కారణాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో, మానసిక సమస్యలే కారణం- నా విషయంలో మాదిరి.

నాకు ఇప్పుడు 28 ఏళ్లు. పన్నెండేళ్ల వయసులో నాపై ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడి నాపై మానసికంగా చాలా ప్రభావం చూపించింది. ఆ ప్రభావం కారణంగానే, నేను ఎవరితో సెక్స్‌లో పాల్గొన్నా, భావప్రాప్తి కలగడం లేదు. నాకు భావప్రాప్తి ఎప్పటికీ కలగదనే భావన నాలో బలపడుతూ వచ్చింది. దీనివల్ల టీనేజీ వయసు నుంచి ఏ అమ్మాయితోనూ సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లలేకపోయాను.

చిన్న వయసులో ఉన్నప్పుడు ఇదో సమస్యే కాదన్నట్లు వ్యవహరించేవాడిని. భవిష్యత్తులో ఏదో ఒక దశలో దీనిని పరిష్కరించుకుంటానులే అని నాకు నేను సర్దిచెప్పుకొనేవాడిని.

నాతో గడపడానికి కొందరు అమ్మాయిలు మా ఇంటికి వచ్చేవారు. వారితో సెక్స్‌లో పాల్గొనేవాడిని. తర్వాత అంగం మెత్తబడేది. భావప్రాప్తి మాత్రం కలిగేది కాదు. దీనివల్ల నాతో సెక్స్‌లో పాల్గొన్న అమ్మాయికి, నాకు ఇద్దరికీ అసంతృప్తి కలిగేది. కొందరు అమ్మాయిలైతే, భావప్రాప్తి దశకు చేరుకోకుండా ఎక్కువ సేపు సెక్స్ చేయగలిగే అబ్బాయి దొరికితే 'జాక్‌పాట్' దొరికినట్లేనని జోక్ చేసేవారు.

అయితే నాతో కొన్ని నెలలపాటు కలిసి ఉన్న ఏ అమ్మాయికైనా నాకు భావప్రాప్తి కలగదనే విషయం తెలిశాక అసంతృప్తే మిగిలేది. శృంగారంలో నన్ను సంతోషపెట్టలేకపోతున్నామని ఆ అమ్మాయిలు అనుకొనేవారు. వారిలో అలాంటి ఆలోచనను పోగొట్టేందుకు నా ప్రయత్నం నేను చేసేవాడిని. కానీ అసలు సమస్య ఏమిటనే ప్రశ్న వచ్చేది. నా పరిస్థితి గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండేది కాదు.

నేను ఓసారి సెక్స్‌లో అత్యంత సుదీర్ఘంగా రెండు గంటలపాటు పాల్గొన్నాను. నిజాయతీగా చెప్పాలంటే అంతసేపు పాల్గొనేసరికి మా ఇద్దరికీ చిరాకుగానే అనిపించింది. చివరకు నేనే ఆపేశాను. ఆమె శృంగారాన్ని ఆస్వాదించడం కన్నా, నా గురించి, నేను భావప్రాప్తికి ఎంత దగ్గరగా ఉన్నానా అనేదాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అనిపించింది. ఆమె అలా ఆలోచించడం నాకు ఆందోళన కలిగించింది.

నాకున్న సమస్యను ఇంతకాలం విస్మరిస్తూ వచ్చాను. స్నేహితులు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్లు చేసుకొంటున్నారు. నేను మాత్రం ఇంకా ఒంటరిగానే ఉండిపోయాను. పెళ్లి చేసుకొంటే, నా భార్య నాలో 'లోపాన్ని' గుర్తించినప్పుడు ఎలా స్పందిస్తుందనే ఆలోచనే నన్ను తొలచివేస్తోంది. అదే సమయంలో, జీవితాంతం తోడు లేకుండా ఇలా ఒంటరిగానే బతకక తప్పదా అనే ప్రశ్న బాధిస్తోంది.

నేను తొలిసారిగా నా గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించినప్పుడు నా సమస్య గురించి నాకు తెలిసింది. ఆమెకు అప్పుడు 17 ఏళ్లు. తను అంతకుముందు సంవత్సర కాలం నుంచి నా గర్ల్‌ఫ్రెండ్. మా ఇద్దరికీ అదే తొలి అనుభవం.

ఏం చేయాలో అర్థం కాలేదు

వారాంతం కావడంతో వాళ్ల అమ్మానాన్న వేరే చోటకు వెళ్లారు. అది శనివారం మధ్యాహ్నం. తొలిసారిగా కలుస్తుండటంతో మేమిద్దరం చాలా ఉద్వేగానికి లోనయ్యాం. ఇద్దరం ముద్దులు పెట్టుకున్నాం. ఒకరినొకరు తడుముకున్నాం. తర్వాత నాకు అంగస్తంభన కలిగింది. నన్ను తాకాలంటే తను ఆందోళన చెందింది. అయితే నాలాగే తనకూ శృంగారం గురించి పెద్దగా తెలియకపోవడం ఒక విధంగా నాకు సంతోషాన్ని కలిగించింది.

రతి మొదలవుతుండగా నాలో ఒక ఆలోచన బయల్దేరింది. ''నేను సెక్స్ చేయలేకపోతే ఎలా? నాలో లోపం ఉంటే ఎలా'' అనే సందేహాలు కలిగాయి. ఈ ఆలోచన ఎందుకొచ్చిందో తెలియదు. ఈ ఆందోళనతో అంగం మెత్తబడింది. అదే రోజు మరికొన్నిసార్లు ప్రయత్నించాం. అంగం మెత్తబడుతుండటం, మధ్యలో ఆపేయాల్సి వస్తుండటంపై తనలో ఆందోళన పెరిగింది. ఆ రోజు సంభోగం జరగలేదు. ఆ రోజు ఇద్దరం ఆందోళనగానే గడిపాం. రాత్రి పక్కపక్కనే పడుకున్నాం కాని ఒకరినొకరు తాకను కూడా తాకలేదు. మరుసటి రోజు ఉదయం సెక్స్‌లో పాల్గొన్నాం. దాదాపు ఓ అరగంట సెక్స్ తర్వాత, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు స్ఖలనం జరగబోవట్లేదని తెలుసు. అంగం మెత్తబడేవరకు సెక్స్ కొనసాగుతూనే ఉంటుందని తెలుసు. దీంతో అంగం మెత్తబడినట్లు నటించి, సెక్స్ ముగించాను.

నా మాట ఆమె నమ్మిందో లేదో నాకు తెలియదు. కానీ ఆ అనుభవంతో ఆమె సంతృప్తి చెందినట్లే అనిపించింది. మరికొన్ని సందర్భాల్లోనూ నేను ఇలాగే చేశాను.

తాము అంత ఆకర్షణీయంగా లేకపోవడం వల్లే నేను భావప్రాప్తి పొందలేకపోతున్నానని కొందరు అమ్మాయిలు అనుకొంటుంటారు. అది నిజం కాదు. నాకు అనార్గాస్మియా ఉందని, ఆ సమస్యకు కారణాలు ఇవీ అని వివరించడం కంటే కొంతసేపు శృంగారంలో పాల్గొన్న తర్వాత అంగం మెత్తబడినట్లు నటించడమే సులభం.

పోర్న్ చిత్రాలు చూస్తూ హస్తప్రయోగం చేసుకున్నా

పోర్న్ చిత్రాలు చూస్తూ హస్తప్రయోగం చేసుకొంటే కొన్నిసార్లు నేను భావప్రాప్తిని పొందగలిగాను. అప్పుడు నాకో విషయం అర్థమైంది.

అదేంటంటే- అశ్లీల చిత్రాలు చూడటంవల్ల నా సమస్య గురించి నాకు ఆలోచన రాలేదు. అప్పుడు సమస్యపై కాకుండా శృంగారానుభూతిపైనే నేను దృష్టిపెట్టగలిగాను. కానీ వయసు పెరిగే కొద్దీ పోర్న్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నానని అనిపించింది. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు ఉద్వేగాన్ని అంతగా పొందలేకపోతున్నానని కూడా అనిపించింది.

''పోర్న్ చూస్తూ సెక్స్‌లో పాల్గొందామా'' అని కొన్ని సందర్భాల్లో నాతో ఉన్న అమ్మాయిని అడుగుదామని కూడా అనుకున్నాను. ఎవరితోనూ ఎక్కువ కాలం రిలేషన్‌షిప్‌లో ఉండను కాబట్టి, ఇలా అడగడం సబబు కాదనిపించింది. నాకు బాగా తెలిసిన, నేను బాగా నమ్మే అమ్మాయినైతే అలా అడుగుతానేమో!

ప్రతీకాత్మక చిత్రం

ఆ సమస్యల కన్నా ఇది పెద్దది

అనార్గాస్మియా గురించి నా స్నేహితులతో చర్చించేందుకు ప్రయత్నించాను. చాలా మంది భావప్రాప్తి పొందడంలో, అంగస్తంభనలో తమకు ఎదురైన సమస్యల గురించి చెప్పారు. ఇవి అందరికీ ఎదురయ్యే సమస్యలే అనే అర్థంలో మాట్లాడారు. కానీ నా సమస్య అంతకన్నా పెద్దది.

సెక్స్, ట్రామా అంశాల్లో నిపుణుడైన ఒక థెరపిస్టును కొన్ని వారాల కిందట కలిశాను. నాకు లైంగిక ఉద్దీపన కలిగినప్పుడు నాలో కలిగే ఆలోచనల గురించి ఆయనకు వివరించాను. అప్పుడు నాకో విషయం స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే- నాకు లైంగిక ఉద్దీపన కలిగినప్పుడు దానితోపాటు భయం కూడా కలుగుతోంది. ''నాకు భావప్రాప్తి కలుగుతుందా, అంతా సరిగానే జరుగుతుందా'' అనే ఆలోచన నా మెదడును ఆక్రమిస్తోంది.

నా సమస్య వల్ల సుదీర్ఘకాలం నేను భరించలేనంత ఒంటరితనాన్ని అనుభవించాను. భావప్రాప్తి పొందలేకపోతున్న మహిళల గురించి మీరు చదివి ఉంటారుగాని, మగవాళ్ల గురించి చదివి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడే మగవారి ఉద్వేగాల గురించి చదివి ఉండరు. ఈ సమస్య ఉన్న వ్యక్తిని నేనొక్కడినేనేమోనని అనుకొనేవాడిని. థెరపిస్టుతో మాట్లాడాకే నాకు తెలిసింది, ఈ సమస్య నా ఒక్కడిదే కాదని.

నేను సెక్స్‌లో ఎప్పటికీ భావప్రాప్తి పొందలేకపోవచ్చు. దీనిని నాలో నేను అంగీకరించేందుకు ప్రయత్నిస్తున్నా. ఎవరినైనా పూర్తిగా నమ్మి, దగ్గరయ్యేందుకు నేను ప్రయత్నించడం లేదేమోనని కూడా అనిపిస్తోంది. నా పార్ట్‌నర్‌లో నేను ఏం కోరుకొంటున్నానో స్పష్టంగా తెలుసుకొనే వరకు ఎవరితోనూ డేటింగ్‌ చేయకూడదని నిర్ణయించుకున్నాను. దీనిపై నాకేం బాధ లేదు. సమస్య నుంచి బయటపడే దిశగా ఇది తొలి అడుగు.

(బీబీసీ ప్రతినిధి అలెగ్జాండ్రా జోన్స్‌తో ఒక బ్రిటన్ యువకుడు పంచుకున్న నిజ జీవిత గాథ ఇది. ఆయన కోరిక మేరకు వివరాలు వెల్లడించడం లేదు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the reason for not having orgasm after having sex for a long time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X