150 రోజుల్లోనే జెన్ జీ హీరో నుంచి జీరో..! నేపాల్ ప్రధాని దీనగాథ..!

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు జెన్ జీ. తాజాగా భారత్ లోనూ జెన్ జీ ఉద్యమాల కారణంగా ప్రభుత్వాలు దిగొచ్చే పరిస్ధితి వచ్చింది. అంతకంటే ముందే నేపాల్(Nepal), బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లోనూ ప్రభుత్వాలను జెన్ జీ యువత గద్దె దింపేశారు. అయితే ఇలా నేపాల్ లో వచ్చిన జెన్ జీ ఉద్యమం కారణంగా హీరోగా మారిన రాజధాని నగరం ఖాట్మండు మేయర్ బాలెన్ షా (Balen Shah).. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రధాని కూడా అయ్యారు. అయితే ప్రధాని అయిన కేవలం 5 నెలల్లోనే ఆయన తన ప్రాధాన్యం కోల్పోయి, ఇప్పుడు ఉనికి కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. దీని వెనుక ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

భారత్ కు బంగ్లా మరో షాక్..! పాక్ కూటమిలోకి నాలుగో దేశంగా..!
భారత్ కు బంగ్లా మరో షాక్..! పాక్ కూటమిలోకి నాలుగో దేశంగా..!

జెన్ జీ ఉద్యమంతో ప్రధానిగా బాలెన్ షా (Balen Shah)

జెన్ జీ ఉద్యమం నేపథ్యంలో ఎన్నో ఆశలతో జనం ప్రధానిగా గద్దెనెక్కించిన బాలెన్ షా .. ఆ తర్వాత తన సొంత పార్టీ ఆర్ఎస్పీకీ, అధికార కూటమికీ, పార్లమెంట్ కూ, చివరికి ప్రజలకూ దూరమవుతూ వచ్చారు. ఇదంతా కేవలం ఐదు నెలల్లోనే జరిగిపోయింది. మార్చిలో ప్రధాని అయిన బాలెన్ షా.. ఏప్రిల్ లో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ నిబంధనల్ని కఠినం చేశారు. దీంతో మందులు, కిరాణా సామాగ్రి, గృహోపకరణాల కోసం భారత మార్కెట్లపై ఆధారపడే సాధారణ నేపాలీల రోజువారీ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జనం భగ్గుమన్నారు. నిరసనల్ని గమనించి ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంది.

What Went Wrong for Balen Shah Nepal s Gen Z Hero Loses Political Shine in 5 months
డీలిమిటేషన్ బిల్లు కోసం పట్టువదలని కేంద్రం ?- ప్రోరోగ్ కాని లోక్ సభ- అక్కడే డౌట్స్..!
డీలిమిటేషన్ బిల్లు కోసం పట్టువదలని కేంద్రం ?- ప్రోరోగ్ కాని లోక్ సభ- అక్కడే డౌట్స్..!

ఇంటా, బయటా వివాదాలే

ఆ తర్వాత భారత్ లో ఎప్పుడో దశాబ్దాల నాటి సరిహద్దు వివాదాన్ని తెరపైకి తెచ్చిన బాలెన్ షా.. నేపాల్, భారత్ రెండు దేశాలూ పరస్పరం ఆక్రమించుకున్నాయని పార్లమెంట్ లో వివాదాస్పద ప్రకటన చేసారు. దీంతో భారత్ తో పాటు నేపాల్ లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత భారత రాయబారుల్ని సైతం కలిసేందుకు ఆయన నిరాకరించారు.నేపాల్లో భూమిలేని ఆక్రమణదారుల్ని ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం, మున్సిపల్ పోలీసులతో సమస్యల కారణంగా రైడ్-షేర్ డ్రైవర్ గణేష్ నేపాలీ ఆత్మాహుతి చేసుకోవడం బాలెన్ ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేసాయి.

What Went Wrong for Balen Shah Nepal s Gen Z Hero Loses Political Shine in 5 months

ఐదు నెలల్లోనే పతనావస్ధ

తాజాగా జూలైలో భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ జిల్లాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన మత ఘర్షణల్లో ముగ్గురు చనిపోవడంతో స్వయంగా తానే బహిరంగంగా స్పందించాల్సి వచ్చింది. సొంత పార్టీ, పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకపోవడం, వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, పాత వివాదాల్ని కెలకడం, నేపాలీలకు భారత సైన్యంలో ఉద్యోగాలకు అనుమతించకపోవడం ఇలా అన్నీ తప్పిదాలే. ఇవన్నీ కలిసి ఐదు నెలల క్రితం ఆయన్ను ప్రధానిగా గద్దెనెక్కించిన నేపాలీ జెన్ జీ ఇప్పుడు ఆయన్ను దింపేందుకు ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+