వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్, ఎమోజీ.. ఇక ఈజీ, త్వరలోనే ‘రీకాల్’

ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

తాజా ఆండ్రాయిడ్‌ బిల్డ్‌లో యూజర్లు తమ సంభాషణల్లో అత్యంత వేగవంతంగా, సులభతరంగా ఎమోజీలను పంపడానికి ఈ సెర్చ్‌ ఆప్షన్‌ ఉపయోగపడనుంది. ఇన్నిరోజులు యూజర్‌ తమకు కావాల్సిన ఎమోజీలను సైడ్‌ స్క్రోల్‌ చేస్తూ వెతుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్‌ ఆప్షన్‌ పెట్టింది.

ఎమోజీని టైప్ చేస్తే చాలు...

ఎమోజీని టైప్ చేస్తే చాలు...

అందులో మనకు కావాల్సిన ఎమోజీలను టైప్‌ చేస్తే చాలు (ఉదాహరణకు హ్యాండ్‌ అని టైప్‌ చేస్తే), వాటికి సంబంధించిన ఎమోజీలన్నీ మెసేజ్‌ టైప్‌ చేసే కిందకు వచ్చేస్తాయి. వాటిలో మనకు కావాల్సింది, సంభాషణలో ఉపయోగపడేది ఎంపికచేసుకోవచ్చు.

సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేసి...

సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేసి...

ఎమోజీ ఐకాన్‌ను ట్యాప్‌ చేస్తే, ఆ జాబితా అంతా వచ్చేస్తోంది. వాటికింద సెర్చ్‌ ఐకాన్‌ దర్శనమివ్వనుంది. సెర్చ్‌ ఐకాన్‌ క్లిక్‌ చేసి, యూజర్లకు తమకు కావాల్సిన ఎమోజీని సెర్చ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం బీటా యూజర్లకే...

ప్రస్తుతం బీటా యూజర్లకే...

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. బీటా వెర్షన్‌ 2.17.246 ఎమోజీ సెర్చ్‌ యాక్టివేట్‌ అయినట్టు కంపెనీ చెప్పింది.

వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ వారికీ...

వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ వారికీ...

అంతేకాదు, తొలుత ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ కూడా ప్రస్తుతం ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ రిలీజ్‌ చేసింది.

త్వరలోనే రీకాల్ ఫీచర్...

త్వరలోనే రీకాల్ ఫీచర్...

వాట్సాప్ మరో ఫీచర్ గురించి కూడా చాలా రోజులుగా ఊరిస్తోంది. అదే.. రీకాల్‌ ఫీచర్‌. దీనికి కూడా త్వరలోనే లాంచ్‌ చేసేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

ఛాన్స్ ఐదు నిమిషాలే.. దాటితే..

ఛాన్స్ ఐదు నిమిషాలే.. దాటితే..

ఈ ఫీచర్ ద్వారా మీరు పంపిన టెక్స్ట్ మెసేజ్, ఇమేజ్, వీడియో, డాక్యుమెంట్, జిఫ్.. ఏదైనా సరే ఐదు నిమిషాల్లోపల రీకాల్ చేసుకోవచ్చు. అయిదు నిమిషాలు దాటిందంటే మాత్రం అది కుదరదు. పొరపాటును మనం పంపిన సందర్భంలో ఈ రీకాల్ ఫీచర్ ఉపయోగపడుతుంది.

English summary
WhatsApp has added the option to search for emojis in the latest Android build, making it easier and faster for users to find emojis to spice up their conversations. This way WhatsApp users can find some of the emojis relevant to their searches, instead of the tedious side-ways scrolling. Additionally, the app has introduced video streaming on iPhones, a feature that it has already released on Android. Apart from this, the WhatsApp reportedly even published (briefly) an FAQ page to provide information of the long-rumoured message recall feature, suggesting its launch is imminent. As well as messages, the recall will work on images, videos, GIFS, documents, quoted texts and even Status replies. Anything sent more than five minutes ago, however, is unfortunately there to stay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X