వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వాట్సాప్‌'‌కి ఏమైంది: ట్విట్టర్‌లో నెటిజన్ల జోకులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్' సేవలకు మంగళవారం ఉదయం సుమారు రెండు గంటలపాటు అంతరాయం కలిగింది. దీంతో పలువురు వాట్సాప్‌ వినియోగదారులు ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు.

అంతేకాదు ఈరోజు ఉదయం ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో సైతం ‘వాట్సాప్‌ డౌన్‌' హవా కొనసాగింది. ఆ తర్వాత తిరిగి యథావిధిగా పని చేయడం మొదలుపెట్టింది. భారత్, జపాన్, అమెరికా, మలేషియా, కొలంబియా, అమెరికా దేశాల్లో ఈ సమస్య రాగా అనేక ప్రాంతాల్లో దీన్ని గంట, గంటన్నరలోపే పరిష్కరించారని డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.

వాట్సప్‌లోని ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని వినియోగదారులు ఫేస్‌బుక్‌లో సులువుగా షేర్ చేసుకునేలా సేవలను మరింత సమర్థవంతంగా అందించనున్నారని, ఈ నేపథ్యంలోనే వాట్సప్ సేవలకు అంతరాయం కలిగిననట్లు పేర్కొంది. కాగా ‘వాట్సాప్‌ డౌన్‌' విషమంపై ఫేస్‌బుక్ స్పందించలేదు.

ఇటీవల కాలంలో సాంకేతిక సమస్య వాట్సప్‌ను మరితంగా వేధిస్తోంది. వాట్సాప్‌ ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెస్సేజింగ్‌ యాప్‌ల్లో తొలిస్థానంలో ఉంది. 2014 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ సంస్థ దీన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Thousands of disgruntled users of the WhatsApp mobile messenger took to social media worldwide early on Tuesday to vent their anger at the app’s unexpected outage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X