• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సొంత హోటల్‌‌కు రూ. 527 కోట్లు నష్టపోయింది - కాంగ్రెస్ నివేదిక

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డోనల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని తన హోటల్ లాభాలను పెంచి చూపించినట్లు కాంగ్రెస్ కమిటీ విచారణలో తేలింది.

ఆయన సొంత ప్రయోజనాలను చేకూర్చే కొన్ని విషయాలను వెల్లడించలేదని ఆ కమిటీ పేర్కొంది.

ఆయన పదవీకాలంలో 'ది ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌'కు 70 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 527 కోట్లు) మేర నష్టాలు రాగా, ఆ విషయాన్ని కప్పిపుచ్చి దాదాపు 150 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.1.1 వేల కోట్లు) లాభాలను ఆర్జించినట్టు ఆ కంపెనీ చూపించింది.

ట్రంప్ సంస్థ ఈ రిపోర్టును ఖండించింది. నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది.

'అధ్యక్షుడిగా ఉండి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు పొందిన ట్రంప్’

ఫెడరల్ ఖర్చులను పర్యవేక్షించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ) అందించిన పత్రాల్లో ట్రంప్ హోటల్ నష్టాలను కప్పిపుచ్చి లాభాల్లో ఉన్నట్లు తప్పుదారి పట్టించినట్టు తేలిందని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఆన్ ఓవర్‌సైట్ అండ్ రిఫార్మ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ హోటల్‌ని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ట్రంప్ హోల్డింగ్ కంపెనీ దాదాపు 24 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.180 కోట్లు) వెచ్చించినట్టు కమిటీ తెలిపింది.

హోటల్ యాజమానిగా, దాని రుణదాతగా, థర్డ్-పార్టీ రుణాలకు హామీదారుగా ఉన్న ట్రంప్, తనకు సొంత ప్రయోజనాలు చేకూర్చే విషయాలను దాచిపెట్టినట్లు తెలుస్తోందని నివేదిక వివరించింది.

హోటల్‌కు విదేశీ ప్రభుత్వాల నుండి 3.7 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.27 కోట్లు) చెల్లింపులు జరిగాయని డాక్యుమెంట్లలో ఉన్నట్లు కమిటీ తెలిపింది. అంటే, ఈ మొత్తం సగటున ఒక రోజు రేటు ప్రకారం హోటల్‌లో 7,400 రాత్రులు బస చేయడంతో సమానం.

దీంతో, ఫెడరల్ అధికారులపై విదేశీ ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.

నాలుగు సంవత్సరాల పాలనలో ట్రంప్ డాయిషే బ్యాంకు నుంచి కూడా "గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను" పొందినట్లు నివేదిక వెల్లడించింది.

170 మిలియన్ డాలర్ల(దాదాపు 1280 కోట్ల రూపాయలు) రుణం చెల్లింపులను ట్రంప్ ఆలస్యంగా ఆరేళ్ల పాటు చెల్లించేలా ఈ బ్యాంక్ అనుమతించిందని, విదేశీ బ్యాంకు నుండి పొందిన ఈ ప్రయోజనాన్ని అధ్యక్షుడుగా ఉన్న ట్రంప్ బయటపెట్టలేదని డెమోక్రాట్ల నేతృత్వంలోని కమిటీ పేర్కొంది.

విదేశీ చెల్లింపులు, రుణాలకు సంబంధించిన ఇతర పత్రాలను తమకు అందించాలని కమిటీ సభ్యులు జీఎస్ఏను కోరారు.

"రాజకీయ వేధింపు"

కాంగ్రెస్‌ కమిటీ నివేదిక బాధ్యతారాహితంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ట్రంప్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిని "రాజకీయ వేధింపు"గా వర్ణించింది.

2016 సెప్టెంబర్లో ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్‌ అయ్యాక ఈ హోటల్‌ను ప్రారంభించారు.

2017లో తన కంపెనీలకు రాజీనామా చేసిన ట్రంప్, వాటిని తన కుమారుల ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు అప్పగించారు.

అమెరికా మాజీ అధ్యక్షులు గతంలో అనుసరించిన ప్రమాణాలను ట్రంప్‌ అనుసరించలేదని ఎథిక్స్‌ కమిటీ తెలిపింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ హోటల్ లీజును కొనసాగించారని ఇంటర్నల్ జీఎస్ఏ వాచ్‌డాగ్ 2019లో పేర్కొంది.

ట్రంప్ ఆర్గనైజేషన్ 2019 నుంచీ ఈ 263 గదుల హోటల్‌ను విక్రయించడానికి చూస్తోంది. కానీ అది ఇప్పటివరకు దీనిని అమ్మలేకపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
When Donald Trump was the President of the United States, he paid Rs. 527 crore loss - Congress report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X