కారులో బాంబు ఉంది, వైట్ హౌస్‌లోకి వెళ్తున్నా: వ్యక్తి అరెస్ట్
అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేత సౌధంకు కారు బాంబుతో వెళుతున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం కలకలం రేపింది. ఒక కారు శనివారం అర్ధరాత్రి వైట్‌హౌస్ సెక్యూరిటీ గేట్ వద్దకు వచ్చింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేత సౌధంకు కారు బాంబుతో వెళుతున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం కలకలం రేపింది. ఒక కారు శనివారం అర్ధరాత్రి వైట్‌హౌస్ సెక్యూరిటీ గేట్ వద్దకు వచ్చింది.
దాని డ్రైవరు కారులో బాంబు ఉందని అధికారులకు చెప్పాడు. కానీ అధికారులకు బాంబు వంటి ఎటువంటి వస్తువు లభించలేదు. ముందు జాగ్రత్త చర్యగా వైట్‌హౌస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

అటువైపు వచ్చే మార్గాలన్నిటిని మూసివేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. తన కారులో బాంబు ఉందని చెప్పిన వ్యక్తిని పోలీసులు శనివారం రాత్రి గం.11.05 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications