అమెరికా అధ్యక్ష భవనంలో ‘బ్యాగు’ కలకలం... వైట్ హౌస్ మూసివేత

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనంలో ఓ బ్యాగు కలకలం రేపింది. వైట్ హౌస్ భవనంలో పనిచేసే సిబ్బంది దక్షిణం వైపు ఉన్న ప్రాంతంలో ఓ బ్యాగును గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తం అయ్యారు. రంగంలోకి దిగిన వారు ఆ అనుమానిత బ్యాగుతో పాటు అధ్యక్ష భవనంలో అణువణువునా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులెవరైనా వైట్ హౌస్ లోకి చొరబడి ఉండవచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఇటీవల బ్రిటన్ లోని లండన్ నగరంలో పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ దాడిని తామే చేసినట్లు స్థానిక ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో వైట్ హౌస్ లో సిబ్బందికి తెలియకుండా అనుమానిత వస్తువు కనిపించడంతో కాస్త కలకలం రేగింది. భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఆ బ్యాగుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A MAN who approached the White House with a suspicious package and sparked a lockdown has been taken into custody. The secret service said at 12:15pm (3:15am AEDT) that all road closures had been lifted. Journalist Andrew Feinberg had earlier tweeted: “White House on lockdown at 10:25am (1:25am AEDT) for a ‘suspicious package’ per Secret Service Uniformed Division office.”
Please Wait while comments are loading...