ప్రపంచ అగ్రనేతలకే ముచ్చెమటలు పట్టించిన గ్రేటా థన్‌బర్గ్ ఎవరు?
స్వీడెన్: ఆమెకు 16 ఏళ్లు.. కానీ ఓ అంతర్జాతీయ వేదికపై ప్రపంచదేశాల అధినేతలకు ముచ్చెమటలు పట్టించింది. ఒక ప్రధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే మనము... ఆ బాలిక మాత్రం ఏకంగా 60 దేశాల అధినేతలను ఏకి పారేసింది. నాయకులు వారు సంపాదన కోసం పాకులాడే మనస్తత్వమే ఈ రోజు యువత భవిష్యత్తును, భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేసిందని విరుచుకుపడింది.. మా జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారంటూ నేతలను నిలదీసింది. ఇంతకీ ఆ 16 ఏళ్ల బాలిక ఎవరో తెలుసా..? గ్రేటా థన్‌బర్గ్. 2019లో యూఎన్‌లో జరిగిన వాతావరణ పరిరక్షణ సదస్సులో ప్రపంచ అగ్రనేతలను ప్రశ్నించి వార్తల్లో నిలిచింది.

అందరి చూపు 16 ఏళ్ల బాలిక వైపే...
2019 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగిన వాతావరణ పరిరక్షణపై ప్రపంచ అగ్రనేతలు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు దేశాధినేతలు పాల్గొని ప్రసంగించారు. కానీ వీరందరి ప్రసంగాలు షరామామూలు అన్నట్లే సాగాయి. అయితే గ్రేటా థన్‌బర్గ్ అనే 16 ఏళ్ల బాలిక ప్రసంగం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయంటే దానికి కారణం ప్రభుత్వాలు పాలకులే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరం, నాయకులను ఎన్నటికీ క్షమించదని నాయకులను వేదికపై నుంచి కడిగి పారేసింది. తమ భవిష్యత్తును అంధకారంలో పడేసేందుకు హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడమే కాదు.. అంతటి ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని మండిపడింది.

స్కూళ్లో ఉండాల్సిన దాన్ని..ఇక్కడున్నాను
స్వీడన్‌కు చెందిన ఈ టీనేజీ అమ్మాయి ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. వాతావరణం, పర్యావరణ పరిరక్షణకై ఉద్యమిస్తోంది. తను ఈ సమయంలో ఎంతో చక్కగా స్కూళ్లో ఉండాల్సిన దాన్నని తన వయసుకు ఈ సమావేశంకు రాకూడదని చెప్పారు. కానీ పాలకులు చేస్తున్న తప్పులకు పర్యావరణం దెబ్బతిని తమలాంటి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని అందుకే దీనిపై ప్రశ్నించేందుకు తాను వచ్చానని గ్రేటా థన్‌బర్గ్ చెబుతూ భావోద్వేగానికి గురైంది.

ఇప్పటికీ పాలకులు ఆర్థిక అంశాలనే మాట్లాడుతున్నారు
పాలకులంతా కలిసి తను కన్న కలలను చెరిపివేశారని, పాలకులు చెప్పే వట్టి మాటలను నమ్మి తన బాల్యంను కోల్పోయినట్లు గ్రేటా థన్‌బర్గ్ చెప్పింది. అయినప్పటికీ తాను అదృష్టవంతురాలినేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే పాలకులు పర్యావరణంను దెబ్బతీస్తున్న నేపథ్యంలో చాలామంది సామాన్య ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో మనిషి కూడా క్రమంగా అంతరించిపోతాడని చెప్పిన గ్రేటా థన్‌బర్గ్... ఇప్పటికీ పాలకులు తమ దేశ ఆర్థిక వ్యవస్థ, డబ్బులు గురించే కథలు కథలుగా మాట్లాడుతారని చెప్పింది. మీకెంత ధైర్యం అంటూ ప్రశ్నించింది.

భవిష్యత్ తరాలు క్షమించవు
తను పలువురు దేశాధినేతలతో మాట్లాడిన సమయంలో వారంతా యువత గొంతుకను ప్రభుత్వాలు వింటున్నాయని పర్యావరణంపై కచ్చితంగా మంచి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని నమ్మబలికారని చెప్పింది గ్రేటా థన్‌బర్గ్. కానీ వారి మాటలు నమ్మశక్యంగా లేవని, ఒకవేళ నిజంగానే వారు పర్యావరణం నాశనమైపోతోంది అనే సత్యాన్ని గ్రహించి ఉంటే ఎప్పుడో చర్యలు ప్రారంభించేవారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక చివరిగా దేశాధినేతలు పాలకులు ప్రతీసారి యువత కన్న స్వప్నాలపై నీళ్లు చల్లుతున్నారని పర్యావరణంను కాపాడటంలో విఫలమవుతున్నారని చెబుతూ తన ప్రసంగంను ముగించింది గ్రేటా థన్‌బర్గ్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ద్రోహాన్ని యువత పసిగట్టిందని చెప్పిన గ్రేటా థన్‌బర్గ్.... భవిష్యత్ తరాల కళ్లన్నీ నేతలు చెప్పే మాటలపైనే ఉన్నాయని చెప్పింది. ఈ సారి కూడా పాలకులు మోసం చేస్తే యువత వారిని ఎప్పటికీ క్షమించదంటూ తన ప్రసంగాన్ని ముగించింది గ్రేటా థన్‌బర్గ్.

2019 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయాదేశాలకు చెందిన నాయకులు విధానాలను రూపొందించాల్సిందిగా కోరుతూ గ్లోబల్ యూత్ మూవ్‌మెంట్ పేరుతో గ్రేటా థన్‌బర్గ్ ఉద్యమిస్తోంది. వాతావరణం మార్పులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు ఎలా చేయాలో సూచించినందుకు గ్రేటా థన్‌బర్గ్‌ను 2019 టైమ్స్ ''పర్సన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డు వరించింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications