ఐర్లాండ్ ప్రధాని రేసులో భారతీయ గే: ఎవరీ లియో వరద్కర్?
ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన గే ఆ దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్నాయి. డబ్లిన్‌లో నివసిస్తున్న డాక్టర్ లియో వరద్కర్ (38) ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నార
ఐర్లాండ్: ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన గే ఆ దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్నాయి. డబ్లిన్‌లో నివసిస్తున్న డాక్టర్ లియో వరద్కర్ (38) ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన తండ్రిది ముంబై. తల్లిది ఐర్లాండ్. వరద్కర్ 2015లో తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ప్రధానిగా గెలిస్తే ఆ పీఠం ఎక్కిన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడిగా రికార్డులకెక్కుతారు.
ఇప్పటికే క్యాబినెట్‌లోని పలువురు సీనియర్ మంత్రులు, మెజారిటీ ఎంపీలు వరద్కర్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ ఇటీవలే తాను పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

దీంతో తాను ప్రధాని పదవికి పోటీ చేయనున్నట్టు వరద్కర్ ప్రకటించారు. ఆ దేశ గృహనిర్మాణశాఖ మంత్రి సిమ్సన్ కొవెన్నీ సైతం రేసులో ఉన్నారు.
లియో వరద్కర్ ప్రధాని అయితే అతి చిన్న వయస్సులో ప్రధాని అయిన వ్యక్తిగా కూడా ఉంటారు.
వరద్కర్ తండ్రి అశోక్. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. తల్లి మిరియమ్. ఆమె నర్సుగా పని చేశారు. 1970లలో ఇంగ్లాండులో పని చేసే సమయంలో ఇరువురు కలుసుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండులో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఐర్లాండులోని డబ్లిన్‌కు వచ్చారు. వరద్కర్ అక్కడే జన్మించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications