కరోనా పుట్టుకపై అనూహ్య రిపోర్ట్ -వూహాన్ ల్యాబ్‌లో లీకేజీ వల్ల కాదన్న WHO -చైనా చెప్పిందే నిజం!
తను మాత్రం సేఫ్‌గా ఉండి, ప్రపంచ దేశాల పుట్టి ముంచడానికే కరోనా మహమ్మారిని జీవాయుధంగా చైనా ప్రయోగించిందా? వూహాన్ సిటీలో అసహజమైన ప్రయోగాలు చేస్తున్న క్రమంలో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందా? కరోనా అనంతర కాలంలో మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం కాగా, ఒక్క చైనా మాత్రమే వృద్ధిని సాధించడం ఇందుకు నిదర్శనం కాదా? లాంటి అనుమానాలకు ప్రంపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎట్టకేలకు తెరదించింది. కరోనా పుట్టుకకు చైనానే కారణమా? అనే సవాలుకు స్పష్టమైన బదులిచ్చింది..
షర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీ

చైనా చెప్పిందే నిజం..
కరోనా పుట్టుకను తేల్చేందుకు చైనా దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ నిపుణుల బృందం తాజాగా ఓ కీలక అంచనాకు వచ్చింది. చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో కరోనా పుట్టిందన్న వాదన నిజమనేందుకు అవకాశం చాలా తక్కువేనని తేల్చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మిషన్ చీఫ్ పిటర్ బెన్ ఎమ్బారెక్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. నిజానికి ఇదే వాదనను చైనా తొలి నుంచీ వినిపిస్తున్నదే. చైనా లోని వూహాన్ లో తమ స్టడీని పూర్తి చేసినవారు.. 2019 డిసెంబరుకు ముందు వూహాన్ లో గానీ, మరోచోట గానీ వ్యాప్తి చెందలేదన్న బీజింగ్ ప్రకటన సరైనదే అని నిపుణులు కితాబు కూడా ఇచ్చారు. వైరస్ పుట్టుకలో కుట్ర కోణాలు లేవని మొత్తుకుంటున్నా..
దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ

ల్యాబ్‌లో కాదు.. జీవులతోనే..
కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్ల నుంచే వైరస్ పుట్టుకకు సంబంధించి చైనాపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. చైనా ల్యాబ్‌లో జరిగిన ప్రయోగాల ద్వారా ఈ వైరస్ పుట్టిందని, చైనాయే దీనికి కారణమనే వాదన ప్రముఖంగా వినిపించింది. నిపుణులు మాత్రం ప్రస్తుతం ఈ వైరస్ తొలుత జంతువుల్లో పుట్టి ఆ తరువాత మనుషులకు పాకి ఉంటుందనే అంచనాకు వచ్చారు. అయితే..ఏ మార్గం గుండా ఇది మనుషులకు పాకి ఉంటుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కాగా.. కరోనా వైరస్ గురించి జనవరి నాటి చైనా అధికారిక ప్రటకన మునుపే వుహాన్‌లో ఈ వైరస్ ఉందని చెప్పేందుకు ఎటువంటి సంకేతాలు లేవని అంతర్జాతీయ నిపుణుల బృందం తాజాగా స్పష్టం చేసింది. ఇక..

కరోనా కుట్రపై ముగిసిన దర్యాప్తు..
కరోనా పుట్టుకపై తేల్చేందుకు చైనా-ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా వ్యూహాన్ సహా పలు నగరాల్లో చేపట్టిన దర్యాప్తు మంగళవారంతో ముగిసిందని ప్రకటించిన ఎమ్బారెక్.. వైరస్ పుట్టుక ల్యాబ్ లో జరగలేదని తేలిపోయింది కాబట్టి.. ఇక పుట్టుపూర్వోత్తరాలు వెలికితీసేందుకు మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెప్పారు. చైనాలో, హుబే ఫ్రావిన్సులోని వుహాన్ నగరంలో తొలిసారిగా కొత్తరకం వైరస్ బయటపడటం, తర్వాతి క్రమంలో దానికి కరోనా నామకరణం, ఆపై అది మహమ్మారిలా ప్రపంచంపై దండెత్తడం తెలిసిందే. మంగళవారం నాటికి గ్లోబల్ గా మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.71కోట్లకు, మరణాలు 24లక్షలకు పెరిగాయి.