వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించారా?: డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే.? ఇది చైనా మాట

|
Google Oneindia TeluguNews

బీజింగ్: కరోనావైరస్(కొవిడ్-19) అంటే ప్రపంచంలో ఎవరికైనా చైనానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన వైరస్ కాబట్టి. అయితే, ఆ వైరస్ సహజంగా పుట్టిందా? లేక ల్యాబ్‌లో తయారు చేశారా? అనేదానిపై ఇప్పటికీ అనుమానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఎలాంటి ఆధారాలు లేవు..

ఎలాంటి ఆధారాలు లేవు..

ఈ నేపథ్యంలో గురువారం చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనావైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించారనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపిందని చైనా వెల్లడించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికిపైగా కరోనావైరస్ బారినపడిన విషయం తెలిసిందే.

వూహాన్ నగరంలోనే..

వూహాన్ నగరంలోనే..

చైనాలోని వూహాన్ నగరంలోని ల్యాబ్‌లో కరోనావైరస్‌ను సృష్టించారని వస్తున్న ఆరోపణలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ఖండించారు. 2019 ఏడాది చివరలో కరోనావైరస్‌ను చైనాలోని వూహాన్ నగరంలోనే తొలుత గుర్తించిన విషయం తెలిసిందే. అక్కడ్నుంచే వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు చైనా కంటే ఇతర దేశాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం గమనార్హం.

అమెరికాలోనే అత్యధిక మరణాలు.. ప్రపంచంలో లక్షా 30వేలపైనే

అమెరికాలోనే అత్యధిక మరణాలు.. ప్రపంచంలో లక్షా 30వేలపైనే

కరోనావైరస్ కారణంగా అమెరికాలోనే అత్యధిక మరణాలు సంభవించడం గమనార్హం. స్పెయిన్, ఇటలీ దేశాల్లోనూ మరణాల సంఖ్య వేలాల్లోనే ఉంది. అమెరికాలో ఇప్పటికే సుమారు 28వేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్ష మందికిపైగా కరోనాబారినపడి చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,710 కాగా, మృతుల సంఖ్య 1,37,029కు చేరింది.

చైనా వైరస్సే ట్రంప్.. తేల్చే పనిలో అమెరికా..

చైనా వైరస్సే ట్రంప్.. తేల్చే పనిలో అమెరికా..


కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఈ విషయమై స్పందించారు. కరోనావైరస్ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందిందా అనే విషయాన్ని తేల్చేపనిలో తమ ప్రభుత్వం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ వ్యవహారంలో చైనా నిజానిజాలు వెల్లడించాలని స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో డిమాండ్ చేశారు. చైనాకు కొమ్ముకాస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్ గురించి ప్రపంచాన్ని హెచ్చరించలేదనే నెపంతో ఆ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Recommended Video

Coronavirus : India Worst Hit, China Least Affected

English summary
WHO says no evidence coronavirus was made in a lab: China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X