వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు ఆఫ్ఘన్‌వాసుల అవార్డు: అత్యంత ధైర్యవంతుడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాబూల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అరుదైన అవార్డును ప్రకటించారు. మెడల్ ఆఫ్ బ్రేవరీ అవార్డును ట్రంప్‌కు ప్రకటించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టు అఫ్గాన్‌లోని లోగర్‌ ప్రావిన్స​ వాసులు తెలిపారు.

బంగారంతో రూపొందించిన ఈ మెడల్‌పై అఫ్ఘాన్‌ ప్రజల తరఫున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈ శౌర్యపతకం ఇస్తున్నట్టు లోగర్‌ ప్రాంత నాయకుడు ఫర్హాద్‌ అక్బరీ తెలిపారు.

 Why 300 Afghans awarded Donald Trump a 'Medal of Bravery'

645 డాలర్ల వ్యయంతో ఈ మెడల్‌ను రూపొందించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొందుతున్న పాక్‌ తీరును ఖండిస్తూ అమెరికా పాక్‌కు ఆర్థిక సహయాన్ని నిలిపివేసింది.

ఉగ్రవాదంపై పాక్ వ్యవహరిస్తున్న తీరును అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సమయంలోనే అమెరికా వ్యవహరిస్తున్న తీరు భారత్‌కు అనకూలంగా ఉందని పాకిస్థాన్ అభిప్రాయపడింది.ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా కమిటీ కూడ ఇటీవలనే సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది..

English summary
US President Donald Trump has become the unlikely recipient of a 'Medal of Bravery', which has been bestowed on him by 300 Afghans, for his tough stance on Pakistan,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X