వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ చర్యల ఫలితం: చైనా గుప్పిట్లో ‘అమెరికా’ రుణ బాండ్లు.. అద్యంతం టెన్షన్ టెన్షన్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చైనా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలు విధించిన అమెరికాకు భారీగా రుణాలిచ్చింది బీజింగ్. అటువంటి చైనాతో అమెరికాకు వర్తక విభేదాలు తలెత్తితే ఏం జరుగుతుంది? ఇరు దేశాలకే కాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ నష్టం తప్పదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు అటువంటి ప్రమాదమే కనిపిస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్యూరిటీస్‌ను (రుణ బాండ్లు) భారీగా కొనుగోలు చేసిన చైనాతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వర్తక యుద్ధానికి తెరతీశారు.
ఆర్థికంగా బలమైన రెండు పెద్ద దేశాల మధ్య ఇప్పుడు మొదలైన ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చైనాతో అధిక వర్తక లోటు వల్ల అమెరికా నష్టపోతోందని, దాన్ని తగ్గిస్తానని 2016లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించారు. దీంతో అమెరికా రుణ బాండ్ల విక్రేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

తాజా లక్ష కోట్ల డాలర్ల బాండ్ల విక్రయంపై చైనా కినుక వహిస్తే..

తాజా లక్ష కోట్ల డాలర్ల బాండ్ల విక్రయంపై చైనా కినుక వహిస్తే..

అమెరికాతో వర్తక యుద్ధం ముదిరితే తన చేతిలో ఉన్న యూఎస్‌ ట్రెజరీ బాండ్లను చైనా గంపగుత్తగా విక్రయిస్తుందా? తద్వారా అమెరికాను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి అమెరికా 6,260.4 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేస్తే, వాటిలో చైనా 1,168.2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. అదే జరిగితే అమెరికా బాండ్ల మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఈ ఏడాదిలో ఆర్థిక లోటును తట్టుకోవటానికి అమెరికా జారీ చేసే లక్ష కోట్ల డాలర్ల విలువైన బాండ్లను చైనా కొనుగోలు చేయకపోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువ మొత్తంతో సరిపెట్టవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో ఏది జరిగినా అమెరికాకు ఇబ్బందే.

 అమెరికా బాండ్లకు ప్రపంచ మార్కెట్‌లో గిరాకీ ఫుల్

అమెరికా బాండ్లకు ప్రపంచ మార్కెట్‌లో గిరాకీ ఫుల్

అమెరికా ట్రెజరీ బాండ్లలో మూడోవంతు బాండ్లు చైనా, జపాన్‌ చేతుల్లో ఉన్నాయి. చైనా తర్వాత అత్యధికంగా జపాన్‌ వద్ద 1065.8 బిలియన్‌ డాలర్ల అమెరికా బాండ్లు ఉన్నాయి. భారత్ కూడా 148.6 బిలియన్‌ డాలర్ల అమెరికా బాండ్లు కొనుగోలు చేసింది. అమెరికా బాండ్లకు ప్రపంచ మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుంది.

ట్రంప్ ఆంక్షలతో యంత్ర సామగ్రిపై పెరుగనున్న 25 శాతం పన్నుభారం

ట్రంప్ ఆంక్షలతో యంత్ర సామగ్రిపై పెరుగనున్న 25 శాతం పన్నుభారం

ట్రంప్‌ విధించిన సుంకాల ఫలితంగా చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే స్టీలు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10% సుంకాల భారం పడుతోంది. కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌, ఐటీ యంత్రసామగ్రిపై 25% పన్ను భారం పెరుగుతుంది. గత ఏడాదిలో చైనా నుంచి ఈ తరహా వస్తువులు కొనుగోలు చేయటానికి అమెరికా 160 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

అమెరికా సోయాబీన్‌లో 61 శాతం చైనా కొనుగోలు

అమెరికా సోయాబీన్‌లో 61 శాతం చైనా కొనుగోలు

ఏకపక్షంగా దిగుమతి సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి దీటుగానే చైనా ప్రతిస్పందించింది. అమెరికా నుంచి చైనా కొనుగోలు చేసే వైన్‌, పండ్లు-ఫలాలు, పంది మాంసం, రీసైకిల్‌ చేసిన అల్యూమినియంపై పన్నుల భారాన్ని పెంచింది. అమెరికా సోయాబీన్‌కు చైనా అతిపెద్ద వినియోగదారుడిగా ఉంది. గత ఏడాదిలో అమెరికా సోయాబీన్‌లో 61 శాతాన్ని చైనా కొనుగోలు చేసింది.

ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటి?

ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటి?

స్వేచ్ఛా వాణిజ్యానికి తొలి నుంచి అమెరికా అనుకూలం. కానీ చైనా రక్షణాత్మక వాణిజ్య విధానాలను అనుసరించింది. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అమెరికా రక్షణాత్మక విధానాల వైపు మొగ్గుతుండగా, వాటిని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ మార్పుతో ప్రపంచ వాణిజ్యంపై ఆమెరికా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వర్తక లోటు తగ్గింపు చర్చల్లో భారత్

వర్తక లోటు తగ్గింపు చర్చల్లో భారత్

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో మునిగిపోతే మనదేశం మాత్రం చైనాతో వర్తక సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా చైనాతో ఉన్న భారీ వర్తక లోటును తగ్గించుకోవటానికి సంప్రదింపులు ప్రారంభించింది. చైనాతో, భారతదేశానికి దాదాపు 50 బిలియన్‌ డాలర్లు వర్తక లోటు ఉంది. 2017-18లో (ఏప్రిల్‌ నుంచి జనవరి నెల వరకూ) చైనా నుంచి మనదేశం 63.2 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అదే సమయంలో మనదేశం, ఆ దేశానికి చేసిన ఎగుమతుల విలువ 10.3 బిలియన్‌ డాలర్లు మాత్రమే. చైనా నుంచి మనం ఎలక్ట్రానిక్స్‌, బాయిలర్లు, యంత్రాలు, ప్రాథమిక రసాయనాలు దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశం నుంచి చైనా ఆర్గానిక్‌ రసాయనాలు, రాగి, ఖనిజాలు కొనుగోలు చేస్తోంది.

చైనాతో వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లు

చైనాతో వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లు

చైనా నుంచి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ ఉపకరణాలు, దుస్తులు, యంత్రాలు, సామగ్రి, ఫ్యాబ్రికేటెడ్ మెటల్స్, తోలు, ప్లాస్టిక్, రబ్బర్ తదితర వస్తువులను అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. చైనాకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, రవాణా సామగ్రి, చమురు, సహజవాయువు, స్క్రాప్, ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. చైనాతో వాణిజ్య లోటు 2016లో 347 బిలియన్ డాలర్లుగా ఉంటే గతేడాది 375 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇతరదేశాలతో పోలిస్తే అమెరికా వర్తక లోటు గతేడాదితో పోలిస్తే 2017లో 12.1 శాతం అధికం. 2017లో చైనా మినహా ఇతర దేశాలతో వాణిజ్య లోటు 566 బిలియన్ డాలర్లుగా ఉన్నది.

English summary
AS US President Donald Trump ratchets up his trade war with China and the Federal Reserve Board increases US interest rates, the prospects for the world economy and financial markets, so bright just a few months ago, appear to be darkening. Stock markets around the world have fallen back toward their February lows, business confidence has weakened in Europe and much of Asia, and policymakers worldwide are making nervous noises. Are these events the beginning of the end of the global economic expansion, or is the recent market turbulence just a false alarm?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X