వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీ ఎందుకు ఓడిపోయారు?: కారణాలు ఇవే

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అమెరికన్ మీడియా సర్వేలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలకు షాకిచ్చాయి. అంతకుమించి డెమోక్రాటిక్ పార్టీకి, ఆ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఈ ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీని వెనక్కి నెట్టేసి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ విజయం సాధించారు.

పోల్‌ సర్వేల అంచనాలన్నీ తలకిందులు చేసి ట్రంప్‌ వైట్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. కొన్ని సర్వేలైతే 90శాతం హిల్లరీనే గెలుస్తుందని కూడా చెప్పాయి. అయినప్పటికీ హిల్లరీ ఓడిపోయారు. చివరకు కనీసం పోటా పోటీ ఫలితాలు కూడా లేకుండా ట్రంప్‌ గెలుపు ఖరారైపోయింది. అయితే ఎందుకిలా జరిగింది, హిల్లరీ గెలుపు అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

trump-hillary

ట్రంప్ గెలుపునకు.. హిల్లరీ ఓటమికి కొన్ని కారణాలు

అమెరికాలో గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్నది డెమోక్రటిక్‌ పార్టీ. సాధారణంగా ప్రజలు ప్రత్యర్థి పార్టీకే అవకాశం ఇస్తుంటారు. అమెరికాలో 1945 అనంతరం ఒక పార్టీ వరుసగా రెండుసార్ల కంటే ఎక్కువగా ఎప్పుడూ గెలుపొందలేదు. ఇది కూడా హిల్లరీ పరాజయానికి ఓ కారణంగా కనిపిస్తోంది.

అంతేగాక, గ్రామీణ అమెరికన్ల ఎక్కువగా ట్రంప్‌కు మద్దతిచ్చారు. అర్బన్‌లో హిల్లరీకి పట్టు ఉంటుందని భావించినప్పటికీ.. ఆమె పట్టణ ఓట్లలోనూ ఆధిక్యం సాధించలేకపోయారు. ముఖ్యంగా వైట్‌ అమెరికన్ల మద్దతు ట్రంప్‌కు ఎక్కువగా లభించింది. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ ప్రసంగాలు అమెరికన్లు చాలానే ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అదే స్థాయిలో హిల్లరీ ఆకట్టుకోలేకపోయారని తేలిపోయింది.

ఏ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వని అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్స్‌ ఫ్లోరిడా, అయోవా, నార్త్‌కెరోలినా, ఓహియో, పెన్సిల్వేనియాలను హిల్లరీ దక్కించుకోలేకపోయారు. కీలకమైన ఈ రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఆధిక్యాన్ని చాటుకున్నారు.

ఆర్థిక విధానాల్లో హిల్లరీ తన విధానాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌ మాత్రం వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు తీసుకొస్తానని తన ఆర్థిక విధానాలను బలంగా వినిపించి అమెరికన్ల మద్దతును కూడగట్టుకున్నారు. ఈ అంశం హిల్లరీ ఓటమిపై చాలా ప్రభావమే చూపింది.

కాగా, హిల్లరీ ప్రైవేట్‌ ఈ-మెయిల్‌ సర్వర్‌ కుంభకోణంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టడం, ఆ తర్వాత ఆమె నిర్ధోషి అని ప్రకటించడం జరిగింది. అయితే, అప్పటికే జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ విషయంలో తన నిర్ధోషిత్వాన్ని కూడా హిల్లరీ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. దీన్ని ట్రంప్ తన అస్త్రంగా మలుచుకుని విజయం సాధించారు.

అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్‌ గట్టిగా ప్రచారం చేయగా.. అదే స్థాయిలో హిల్లరీ బలమైన సందేశం ఇవ్వలేకపోవడం. ఆమె ఎక్కువగా తాను ట్రంప్‌ కంటే అనుభవం కలిగిన, అర్హత ఉన్న వ్యక్తి అనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చారు. ట్రంప్ మాత్రం తన శక్తి సామర్థ్యాలను, అమెరికా పట్ల తన చిత్తశుద్ధి ఏంటనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఉగ్రవాద నిర్మూలన తన వల్లే సాధ్యమని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అమెరికన్లు కట్టుబడిపోయారు. వలసవిధానం, ఆర్థిక విధానాల రూపకల్పన, అమెరికాను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దుతానని హిల్లరీ ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లలేకపోయారు. దీంతో అమెరికన్లు ఆమెను పూర్తి స్థాయిలో నమ్మలేకపోయారు. ఇవన్నీ కూడా హిల్లరీ ఓటమికి, ట్రంప్ గెలుపునకు కారణంగా నిలిచినట్లు తెలుస్తోంది.

English summary
As Democrats grapple with their loss to such an unpopular and divisive rival, persistent problems with Clinton’s campaign offer some explanation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X