వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ సినిమా మౌలా జాట్ భారత్‌లో ఎందుకు విడుదల కాలేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' భారత దేశంలో కూడా విడుదలవుతుందని భావించినా, చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది.

ఈ పాకిస్తానీ యాక్షన్ మూవీ డిసెంబర్ 30న దిల్లీ, పంజాబ్‌లలోని థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.

ఇండియాలో ఈ సినిమా విడుదల ఎందుకు ఆగిపోయిందన్నదానిపై అధికారికంగా ఎలాంటి కారణం బయటకు రాలేదు.

భారతదేశంలో ప్రముఖ మల్టీప్లెక్స్ సినిమా గ్రూప్‌ పీవీఆర్ అండ్ ఐనాక్స్ థియేటర్‌కు చెందిన ఉద్యోగులను ఈ విషయంపై పీటీఐ ప్రశ్నించినప్పుడు విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ తమకు చెప్పినట్లు వెల్లడించారు.

''ఈ విషయం మాకు రెండుమూడు రోజుల కిందటే చెప్పారు. కానీ, ఎలాంటి కారణం చెప్పలేదు. తదుపరి విడుదల తేదీని కూడా చెప్పలేదు’’ అని చెప్పారు.

పంజాబీ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలోని థియేటర్లలో మౌలా జాట్ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఐనాక్స్ సినిమా గ్రూప్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ జయలా చెప్పారు.

ఆయన ప్రకటన తర్వాత ఈ సినిమా విడుదల కోసం చాలామంది ఎదురు చూశారు. 'బుక్ మై షో' వంటి ప్లాట్‌ఫామ్‌లపై ఈ సినిమా ప్రమోషన్ పోస్టర్లు కూడా దర్శనమిచ్చాయి.

ఈ వారం ప్రారంభంలోనే పీవీఆర్ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 'మౌలా జాట్' విడుదల తేదీని ప్రకటించింది. అయితే, ఒకటి రెండు రోజుల ఆ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు.

'మౌలా జాట్' ఇండియాలో ఎందుకు విడుదల కాలేదు?

కొన్ని రిపోర్టుల ప్రకారం, మౌలా జాట్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వలేదు.

అయితే, సెన్సార్ బోర్డ్ నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. వెబ్‌సైట్‌లో కూడా ఎలాంటి వివరాలు లేవు.

సెన్సార్ బోర్డ్ ఆమోదం పొందిన తర్వాతే ఏ సినిమా అయినా థియేటర్లలో సినిమా విడుదల అవుతుంది.

అందువల్ల రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలను నిలిపివేసే నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

భారతదేశంలో 'మౌలా జాట్' సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే, 2011లో 'బోల్' తర్వాత విడుదలైన పాకిస్తానీ చిత్రం ఇదే అవుతుంది.

జీ స్టూడియోస్ సంస్థ మౌలా జాట్ భారతదేశపు డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందింది. అయితే, సినిమా విడుదల నిలిపివేత గురించి వారు కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

జీ గ్రూప్ ఇండియాలో సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతోపాటు అనేక టీవీ చానెళ్లను కూడా నిర్వహిస్తోంది.

ఈ సంస్థ కొన్నేళ్ల కిందట ప్రారంభించిన ఒక చానెల్ పాకిస్తానీ సీరియళ్లను కూడా ప్రసారం చేసింది. వాటి కారణంగానే ఆ చానెల్ ఫేమస్ అయ్యింది.

ఒక దశలో జీ గ్రూప్ పాకిస్తాన్ సినీమాటోగ్రాఫర్లతో కలిసి సినిమాలు నిర్మించడానికి కూడా సిద్ధమైంది.

అయితే ఉరీ, పుల్వామా ఘటనల తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఇండియాలో విడుదలైన పాకిస్తానీ సీరియల్, సినిమా ప్రణాళికలు ఆగిపోయాయి.

మౌలా జాట్

ఈ సినిమా నటులు ఫవాద్, మహిరా ఎవరు?

'మౌలా జాట్' సినిమాలో నటులైన ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లు ఇద్దరూ బాలీవుడ్ సినిమాలలో నటించారు.

2017లో షారుక్‌ ఖాన్‌తో కలిసి 'రయీస్‌' చిత్రంలో మహీరా నటించింది. అప్పట్లో ఆమెపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఫవాద్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశాడు.

2016లో ఉరీ దాడి తర్వాత, ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ పాకిస్తానీ నటీనటులను భారతీయ సినిమాలలో తీసుకోకుండా నిషేధించింది.

మహారాష్ట్రలో శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేనలు పాకిస్తానీ నటులను భారతీయ సినిమాల్లో నటించనివ్వబోమని హెచ్చరించాయి.

పాకిస్తానీ యాక్టర్లు ఉన్న సినిమా విడుదలను అనుమతించబోమని తేల్చి చెప్పాయి.

భారతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం 'మౌలా జాట్'చిత్రం విడుదలపై కూడా విమర్శలు వినిపిస్తున్నయి.

ఎందుకంటే ఈ సినిమాలో నటించిన హమ్జా అలీ అబ్బాస్, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు మద్దతుదారుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

'మౌలా జాట్' చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయనివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కొద్ది రోజుల కిందటే హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why Pakistani movie Maula Jaat is not released in India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X