జాక్‌పాట్: లాటరీలో రూ.20.29 కోట్లు దక్కించుకొన్న ఎన్ఆర్ఐ

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్:దుబాయ్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన హరికృష్ణన్‌కు 12 మిలియన్ దిర్హామ్‌లు లాటరీలో గెలుచుకొన్నాడు.ఇండియా కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.20.29 కోట్లు. లాటరీలో ఇంత పెద్ద బహుమతిని గెలుచుకోవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.

Wife of Dh12m Abu Dhabi raffle winner thought it was a prank

అబుదాబిలో బిగ్ టికెట్ అనే సంస్థ ఆదివారం తీసిన లాటరీలో కేరళకు చెందిన హరికృష్ణన్‌ ఈ బహుమతిని కైవసం చేసుకొన్నాడు.దుబాయిలోని ఓ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న హరికృష్ణన్‌ నాయర్‌ పని చేస్తున్నాడు. 2002 నుంచి కుటుంబంతో కలిసి హరికిషనన్‌కు అక్కడే ఉంటున్నాడు.లాటరీలో ఇంత మొత్తాన్ని గెలుచుకొన్న విషయాన్ని హరికృష్ణన్ నమ్మలేకపోతున్నాడు .

ఈ డబ్బుతో ప్రపంచాన్ని చుట్టి రావాలనే తన కోరికను తీర్చుకొంటానని హరికృష్ణన్ చెప్పారు.తన ఏడేళ్ల కొడుకు చదువుకు, భారత్‌లో ఓ ఇంటి కొనుగోలుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తానని తెలిపారు. తల్లిని, భార్యను చక్కగా చూసుకుంటానని, వీలైనంత సాయం కూడా చేస్తానని ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

లాటరీలో కోట్లాది రూపాయాలను గెలుచుకొన్నట్టు తన భర్త ఫోన్ చేసి చెబితే నమ్మలేదని హరికృష్ణన్ భార్య గుర్తు చేశారు.ఆటపట్టించేందుకు హరికృష్ణన్ తనకు ఫోన్ చేశారని భావించానని ఆమె చెప్పారు. అయితే నిజంగానే లాటరీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయంటే నిజంగానే ఆశ్చర్యంగానే ఉందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nisha Hari was about to play a prank on her husband by telling him he has won Dh12 million in Big Ticket Draw on Sunday morning

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి