వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19: ఒంట్లో పెరిగిన కొవ్వులో కరోనా వైరస్ తిష్ఠ వేస్తుందా, భారీకాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కొవ్వు, ఊబకాయం ఉన్నవారిలో కోవిడ్ వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి

హోమర్ రాసిన 'ది ఇలియడ్’ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ట్రాయ్ నగరాన్ని జయించడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నించిన గ్రీకులు, చివరకు ఒక కొయ్యగుర్రం (ట్రోజన్ హార్స్) లో దాక్కుని తమ లక్ష్యాన్ని ఎలా సాధించారో 'ది ఇలియడ్’ కథ చెబుతుంది.

అచ్చం ట్రాయ్ నగరంలోలాగే మన శరీరంలో కూడా ఒక ట్రోజన్ హార్స్ ఉంది.

అందులో మన శత్రువైన కరోనా వైరస్ దాక్కుని మనల్ని జయించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ట్రోజన్ హార్స్ పేరే బాడీ ఫ్యాట్ (కొవ్వు)

కరోనా వైరస్ కోసం ఒక ట్రోజన్ హార్స్

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొవ్వును తనకు అనుకూలమైన రిజర్వాయర్‌లా మార్చుకుంటుంది. అందుకే ఊబకాయం ఉన్న రోగుల శరీరంలో ఈ వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది.

ఊపిరితిత్తుల కణాలలో యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ టైప్-2 కూడా పెరుగుతుందని స్థూలకాయం ఉన్న జంతువులను పరిశీలించినప్పుడు తేలింది. ఇది వైరస్ కోసం ఎక్కువ సంఖ్యలో బైండింగ్ సైట్‌లను సూచిస్తుంది. పల్మనరీ ఎపిథీలియంలోకి వైరల్ కణాల ప్రవేశానికి అనుకూలంగా మార్చుతుంది.

కోవిడ్-19 వైరస్ వృద్ధి చెందే కొద్దీ దానిపై పోరాటం చేసే కార్యక్రమం ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. ఇక్కడే రోగ నిరోధక శక్తి ఎక్కువగా పని చేస్తుంది. అయితే, ఊబకాయం ఉన్నవారిలో లో-గ్రేడ్ క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ గుణాలే మనిషిలో రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేస్తాయి.

ఇవి తక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేసే గుణం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కోవిడ్ లాంటి వైరస్‌లు సులభంగా మనిషి శరీరంపై దాడి చేయగలుగుతాయి.

మరోవైపు, ఊబకాయం ఉన్నవారిలో పొట్ట భాగంలో ఉన్న అధిక కొవ్వు వల్ల ఊపిరిత్తులు ఒత్తిడికి లోనవుతాయి. తద్వారా వాటి సామర్ధ్యం తగ్గిపోతుంది. ఈ కారణంగా సదరు మనిషి సులభంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడేందుకు అవకాశం ఏర్పడుతుంది.

నిజానికి, ఊబకాయం శ్వాసకోశ వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌లకు ప్రమాద కారకంగా భావించడం ఇదే మొదటిసారి కాదు. 2009లో H1N1 ఇన్‌ఫ్లూయెంజా వ్యాపించిన సమయంలో, ఊబకాయం ఉన్నవారు వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ వరకు వెళ్లాల్సిన అవసరం బాగా పెరిగింది.

ఊబకాయం ఉన్నవారిలో ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది

నగరంలో జామ్‌లు, సరఫరా సమస్యలు

ఊబకాయం ఉన్న వ్యక్తి శరీరాన్ని గోడలున్న నగరంగా ఊహించుకోండి. ఈ వ్యక్తి శరీరపు గోడలలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఈ నగరం రహదారులలో అధిక రక్తపోటు, అథెరో స్క్లెరోసిస్ లేదా కార్డియోవాస్కులర్ పాథాలజీ లాంటి అడ్డంకులు ఏర్పడుతుంటాయి.

వీటితోపాటు ఆహారం అందకపోవడం (ఇన్సులిన్ సమస్యల వల్ల ), గాలి అందకపోవడం (శ్వాసకోశ సమస్యల వల్ల)లాంటి అవాంతరాలు కూడా ఎదురవుతుంటాయి.

కొవ్వు కణజాలం ట్రోజన్ హార్స్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి, అప్పటికే బలహీనంగా, అనారోగ్యంతో ఉన్న ఈ నగరంలోకి కోవిడ్ లాంటి ఆక్రమణ దారులు సులభంగా చొరబడతారు.

అంటే, ఈ కొవ్వు శత్రువుకు ఆశ్రయంలాగా ఉపయోగపడుతుంది. ఈ ఆక్రమణదారులు ఈ నగరానికి ఇతర కొత్తకొత్త మార్గాలను, మరిన్ని ప్రవేశద్వారాలను వెతుకుతుంటారు (శరీరంలోని ఊపిరి తిత్తుల్లాంటివి)

దీంతో సమస్య పెరుగుతుంది. మన శరీరమనే నగరంలో రోగ నిరోధక శక్తి అనే సైనికులు వైరస్‌ను పారదోలడానికి ప్రయత్నించినప్పుడు, వారి బలహీన స్వభావం కారణంగా నగరానికి పెను నష్టం కలుగుతుంది.

ఇదేకాక, తాను ఎక్కడైతే దాక్కుందో ఆ కొవ్వు మీదనే కరోనా వైరస్ దాడి చేయడం వల్ల కొవ్వు కణాలు చచ్చిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల శరీరానికి కావలసిన ఆహార సరఫరా నిలిచిపోతుంది.

అంటే, శరీరంలో ఉన్న అధిక కొవ్వు కారణంగా కోవిడ్ లక్షణాలు మరింత పెరిగి, చివరకు ఆసుపత్రిలో చేరాల్సి రావడం, ఒక్కోసారి మరణం వరకు దారి తీస్తుంది.

కొవిడ్ ప్రమాద తీవ్రతను తగ్గించాలంటే ఊబకాయం, కొవ్వు లేకుండా జాగ్రత్తపడాలి

వృద్ధులు, మహిళలు బాధితులు

ఊబకాయం ఉన్న మగవారిలోనైతే, అంతర్గత స్థాయిలో కొవ్వు కణజాలం పంపిణీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక కణాల ఎక్కువగా క్రియాశీలం కావడానికి దారితీసే ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల పెరుగుదలకు కారణమవుతుంది.

ఇది కోవిడ్-19 లక్షణాల తీవ్రతను పెంచే సైటోకిన్ తుపాన్ ( సైటోకిన్ స్ట్రామ్)కు కారణమై, ప్రమాదకరంగా మారుతుంది.

ఇక ఊబకాయం ఉన్న స్త్రీలైతే, వారికి దీని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందని తేలింది.

ముఖ్యంగా కోవిడ్ లక్షణాలను, కారణాలపై విపరీతమైన పరిశోధన జరిగిన తర్వాత శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న స్త్రీలకు కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువని తేలింది.

ఇక వృద్ధులలో అంటే 55 సంవత్సరాలు దాటిన వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.

అధిక కొవ్వులున్న యువకులకు, కొవ్వులు తక్కువగా ఉన్న వృద్ధులలో ఈ సమస్య దాదాపు సమానంగానే ఉన్నట్లు పరిశోధనలు తెలిపాయి.

స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ అధికంగా ఉన్నప్పుడు వారు తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం, మెకానికల్ వెంటిలేషన్, ఇంటెన్సివ్ కేర్ లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

స్థూలకాయంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా ఎక్కువకాలం ఆసుపత్రిలో ఉండాల్సిన రావడం కూడా కనిపిస్తుంది. వారిలోని వైరస్ ఉనికిని తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

వైరస్ శరీరంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటి సీక్వెల్స్, పరివర్తనలు జరిగే ప్రమాదం కూడా ఉంది.

వీటన్నింటినీబట్టి చూస్తే, ప్రస్తుతం అందరూ ఊబకాయం అనే మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will corona harm more in obess people, what care should be taken
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X