అమెరికాకు చెడ్డవారు, ఓ వ్యక్తి వచ్చి, ఆ తర్వాత కుటుంబాన్ని తెస్తాడు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా వీసా విధానం, వలసలపై ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటి వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లే అవకాశముందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
త్వరలో చైన్ మైగ్రేషన్ సిస్టమ్‌కు, వీసా లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతామని తెలిపారు. న్యూయార్క్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన యువకుడు దాడికి పాల్పడిన ఘటనను ఆయన ఉటంకించారు.

అమెరికాకు చెడ్డవాళ్లు వస్తున్నారు
త్వరలోనే చైన్ మైగ్రేషన్ సిస్టంను, వీసా లాటరీ పద్ధతిని ఆపేస్తామని ట్రంప్ తెలిపారు. లాటరీ విధానం ద్వారా అమెరికాకు కొంతమంది చెడ్డవాళ్లు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారు మాకు వద్దని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఒక వ్యక్తి వస్తాడు, ఆ తర్వాత కుటుంబాన్ని తెచ్చుకుంటాడు
వీటి వలసల వల్ల దేశానికి నష్టం కలుగుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఒక్క వ్యక్తి వీసా తీసుకుంటాడని, ఆ తర్వాత కుటుంబం మొత్తాన్ని తీసుకు వస్తాడని ట్రంప్ అన్నారు.

ఇదే మొదటిసారి కాదు
వలస విధానాలపై ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. న్యూయార్క్ ఘటన జరిగిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా వలస విధానాల్లోని లోపాలను వెంటనే సరిదిద్దాలంటూ చట్టసభ కాంగ్రెస్ సభ్యులకు పిలుపునిచ్చారు.

సంస్కరణలపై ట్రంప్
ఇక అమెరికా పన్ను సంస్కరణల గురించి ట్రంప్ మాట్లాడారు. తమ దేశం అభివృద్ధిలో వేగంగా పుంజుకుంటోందని, శక్తిమంతంగా తయారవుతోందన్నారు. పన్ను సంస్కరణల వల్ల నాలుగు ట్రిలియన్ డాలర్లను తిరిగి దేశంలోకి తీసుకురాగలుగుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications