పిల్లలను ఫ్రీజింగ్ కారులో లాక్ చేసి, వైన్ కోసం వెళ్లారు

వాషింగ్టన్: అమెరికాలో దంపతులు తమ పిల్లల పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించిన ఘటన వెలుగు చూసింది. దంపతులు గడ్డ కట్టే ఉష్ణోగ్రత గల కారులో ఉంచేసి, వైన్ రుచి చూసే కార్యక్రమానికి వెళ్లారు. సీట్లకు పిల్లలను కట్టేసి వెళ్లిపోయారు. వాషింగ్టన్‌లో ఈ సంఘటన జరిగింది.

అందుకుగాను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే జెన్నీ చాంగ్ (46), క్రిస్టఫర్ లుకాస్ (41) పిల్లలను అలా వదిలేసి వెళ్లిపోయారు. వారిని శనివారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. కారులో గడ్డ కట్టే ఉష్ణోగ్రతలో పిల్లలు తల్లిడిల్లుతున్న విషయాన్ని చూసినవారు పోలీసులకు సమాచారం అందించారు.

Wine-tasting couple 'left toddlers in freezing car'

వోల్వోలోకి చూసేసరికి 22 నెలల వయస్సు, రెండున్నరేళ్ల పిల్లలు కారులో సీటు బెల్టులతో కటెట్సి ఉండడం కనిపించింది. ఇద్దరు పిల్లలు కూడా కోట్లు ధరించారు. అయితే, గ్లౌజులు గానీ టోపీలు గానీ లేవు. చిన్న బాలిక అత్యంత దయనీయంగా ఏడుస్తూ ఉండడం కనిపించింది. ఉష్ణోగ్రత 1.7 సెల్సియస్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

లాక్ చేసిన కారులోకి వారు వెళ్లారనేది పోలీసులు ఆరా తీస్తుండగా లుకాస్ రెస్టారెంట్‌లోంచి బయటకు వచ్చింది. ఐఫోన్ ద్వారా తన పిల్లలను ఎప్పటికప్పుడు చూసుకుంటున్నట్లు ఆమె చెప్పింది. అయితే, కాల్ 58 నిమిషాలకు కనెక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

దంపతులు రెస్టారెంట్ సమీపంలోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన లూకాస్ ప్రాన్స్‌కు చెందిన మహిళ. పిల్లలను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని, తల్లిదండ్రులను జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+