నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మండేలా మృతి
జోహన్స్ బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ సతీమణి విన్నీ మండేలా సోమవారం నాడు మరణించారు. ఆమె వయస్సు 81 ఏళ్ళు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబసభ్యులు ప్రకటించారు.
అనారోగ్యంతో ఆమె ఏడాదిగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడు నెల్సన్ మండేలాను విన్నీ మండేలా వివాహం చేసుకొన్నారు. ఆమె యాక్టివిస్టుగా పనిచేశారు.

నెల్సన్ మండేలా అరెస్టై జైలు జీవితం గడిపిన సందర్భంలో ఆయన విడుదల చేయాలని కోరుతూ విన్నీ మండేలా ఉద్యమం చేశారు. మండేలాని పెళ్లి చేసుకోకముందే సామాజిక కార్యకర్త అయిన విన్నీ, తన వైవాహిక జీవితంలో మండేలాకు ఎంతగానో తోడ్పాటు అందించారు. 38 ఏళ్లు మండేలాతో వివాహా బంధం కొనసాగించిన విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications