Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరుడు లేకుండా పెళ్లి!: తల్లితో హానిమూన్‌కి(వీడియో)

కాలిఫోర్నియా: ఓ యువతి వరుడు లేకుండానే వివాహ కార్యక్రమం ముగించేసింది. అయితే అక్కడ వివాహం మాత్రం జరగలేదు. దీంతో ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తన తల్లితో కలిసి హానీమూన్‌కి పయనమైంది. తన వివాహం కోసం స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని నిరాశ్రయులు, అభాగ్యులకు అందజేసింది. అమెరికాలో జరిగిన ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలో క్విన్ డ్యూన్(27), లాన్‌డన్ బోరప్(27)లు గడిచిన శనివారం నాడు వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. స్థానికంగా ఉన్న ప్రముఖ సిటిజన్ హోటల్‌లో వివాహ వేడుక. వివాహా ఆర్డర్లన్నీ ఇచ్చేశారు.

చాలా వరకు డబ్బులు తిరిగి ఇవ్వనివే. వేడుక ఏర్పాట్లకు దాదాపు రూ. 23 లక్షలు ఖర్చు అయింది. అయితే, వివాహం వారం రోజులు ఉందనగా పెళ్లికొడుకు ఉన్నట్లుండి పెళ్ళిని రద్దు చేసుకున్నాడు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

హాల్ బుకింగ్, పూల అలంకరణలు, ఆహార పదార్ధాల ఆర్డర్లు వంటి పలు ఘట్టాలు పూర్తైయ్యాయి. దీంతో పెళ్లికూతురు ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైంది. చిన్నగా తేరుకుని డబ్బులు తిరిగిరావు కాబట్టి, ఏం చేయాలని ఆలోచించింది. తన తల్లిని పిలిచి తాను తీసుకోబోయే చర్య గురించి వివరించింది. ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి తన వివాహ వేడుక ఖర్చును ఏవిధంగా సద్వినియోగం చేయదలచుకుందో తెలిపింది.

కమ్యూనిటీ సంస్థ పెళ్లి విందుపై ప్రచారం చేసింది. ఇళ్లులేని వాళ్లు. ఒంటరివాళ్లు, వృద్ధులు, పసిపిల్లలతో కూడిన కుటుంబాలను విందుకు ఆహ్వానించారు. వాళ్లంతా ఆనందంగా ఆరగించి తృప్తిగా వెళ్లిపోయారు. దీనిపై పెళ్లికూతురు అమ్మ స్పందిస్తూ.. మా కూతురుకు ఇలా జరగటం ఎంతో బాధ కలిగించింది.

చెడు పరిస్థితుల్లో కూడా మంచిగా ఆలోచించడం మా అందరి హృదయాలకు హత్తుకుందని పేర్కొంది. బెలిజీలో హనీమూన్ కోసం బుక్‌చేసిన నగదు కూడా తిరిగి ఇవ్వరు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికూతురు వాళ్ల అమ్మతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి హనీమూన్‌కు పయనమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+