ఇదే చివరి హనీమూన్ అనుకున్నా: ‘ఇస్తాంబుల్’ బాధితుడు
ఇస్తాంబుల్: టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులు, ఆత్మాహుతి దాడులకు తెగబడటంతో 41మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 200మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన అమెరికాకు చెందిన జర్నలిస్టు స్టీవెన్ నబీల్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇరాక్ దేశంలో పుట్టిన అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న స్టీవెన్ నబీల్, నార్మిన్ నూతన దంపతులు. ఈ జంట హనీమూన్ కోసం టర్కీకి వెళ్లారు. టర్కీలో వారం రోజులపాటు హనీమూన్ ను సరదాగా గడిపిన ఆ భార్యాభర్తలు తిరిగి న్యూయార్క్ కు వెళ్లడం కోసం మంగళవారం అర్ధరాత్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు.
కాగా, ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు, కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో తాము కూడా మరణిస్తామేమోనని వారు ఆందోళనకు గురయ్యారు. ఈ హనీమూనే తమకు చివరిది అవుతుందని తాము భావించామని ఈ నూతన దంపతులు చెప్పారు.

'ఈ హనీమూన్‌తోనే జీవితం ముగిసిందనుకున్నాను... బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఓ గన్‌మెన్ ఆయుధంతో ఎయిర్ పోర్టు ఎంట్రీ పాయింట్ వద్దకు వచ్చాడు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న కొందరు ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండగా, మరికొందరు ప్రయాణికులు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇంతలో ఆ దుండగుడు ఏకే-47తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో భార్యను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడ్డాను' అని నబీల్ వివరించాడు.
ఉగ్రవాది తనకు కేవలం అడుగు దూరంలో ఉన్నప్పుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించిందన్నాడు. ఆ ఉగ్రవాది కాల్పులు జరపడంతో తమ జీవితం ఈ ఒక్క హనీమూన్‌తోనే ముగిసిపోయిందని ఆందోళన చెందినట్లు తెలిపాడు. అయితే అక్కడ ఉన్న ఓ బారీకేడ్ వెనుక దాక్కుని ప్రాణాలు నిలబెట్టుకున్నామని చెప్పాడు. భార్య నార్మిన్‌కు కాస్త గాయాలయ్యాయని, కానీ అరవడం లాంటివి మాత్రం చేయవద్దని సూచించినట్లు పేర్కొన్నాడు.
దాదాపు 10-15 నిమిషాల పాటు కాల్పులు జరిపి అనంతరం ఆ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. అంతకుముందు ఆ ఉగ్రవాది కనిపించిన ప్రతీ ఒక్కరిపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications