పింఛన్ కోసం 15ఏళ్ళుగా అంధురాలిగా నటన.. ఈమె నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!!
మన సమాజంలో మనమే షాక్ అయ్యే కొన్ని పరిణామాలు అందరినీ ఆలోచించేలా చేస్తాయి. పింఛన్ కోసం ఒక మహిళ ఏకంగా 15 ఏళ్ల నుండి అంధురాలిగా నటిస్తుంది అంటే నమ్మశక్యం కాకున్నా నమ్మి తీరాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు 15 సంవత్సరాల నుండి అంధురాలిగా నటిస్తూ, అందరినీ నమ్మిస్తూ పింఛన్ తీసుకుంటున్న సదరు మహిళ అసలు కథ తాజాగా బయటకు వచ్చింది.
మేటర్ ఏంటంటే దక్షిణ ఇటలీలోని మెట్రోపాలిటన్ సిటీ ఆఫ్ రెగ్గియా కాలాబ్రియాలోని జియోయా టౌరోకు చెందిన 48 సంవత్సరాల మహిళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీ నుండి వికలాంగ పెన్షన్ పొందుతోంది. ఏకంగా ఇటలీ ప్రభుత్వం నుండి 15 సంవత్సరాలలో దాదాపు 1. 8 కోట్లు పింఛన్ రూపంలో పొందింది. తాను అంధురాలినని వైద్యుడు వద్ద ధ్రువీకరించిన ధృవపత్రాన్ని ఇచ్చి దాదాపు 15 ఏళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది. అయితే తాజాగా ఆమె మొబైల్ ఫోన్ టచ్ స్క్రీన్ ను ఉపయోగించడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైళ్లపై సంతకాలు చేయడం గమనించిన అధికారులు ఆమెపై చట్టమైన చర్చలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.

ప్రభుత్వాన్ని మోసం చేసిన సదరు మహిళ మొత్తంగా ఐఎన్పిఎస్ నుండి చట్ట విరుద్ధంగా రెండు లక్షల ఎనిమిది వేల యూరోలను ఇప్పటివరకు తీసుకుంది. సంపూర్ణంగా అంధత్వం ఉన్నవారికి ఇచ్చే ఈ పెన్షన్ ను మోసపూరితంగా కాజేసిన ఈ మహిళపై చట్టపరమైన చర్యలకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటించింది అంటే ఆస్కార్ ఇవ్వాల్సిందేనంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇంత గొప్ప నటురాలిని షార్ట్ ఫిలిం లో, ఏ సినిమాలో కూడా చూడలేమని చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా ఒకసారి మోసపోతారు కానీ 15 ఏళ్ల పాటు ప్రభుత్వాధికారులు ఎలా మోసపోయారు అంటూ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం, మోసపోయే ప్రభుత్వాలు ఉన్నంతకాలం మోసం చేసేవారు కూడా కచ్చితంగా ఉంటారు అన్నది ఈ ఘటనతో ఆ మహిళ అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.












Click it and Unblock the Notifications