వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీలో కలకలం: పురుషుల దుస్తుల్లో ఆ మహిళ చేసిన పనికి శిక్ష!?..

సౌదీ చట్టాల ప్రకారం అక్కడి మహిళలు డ్రైవింగ్ చేయడం నిషిద్దం.

|
Google Oneindia TeluguNews

రియాద్: సౌదీలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళల పట్ల ఇక్కడ చాలా ఆంక్షలు అమలులో ఉన్నాయి. వాటిని అతిక్రమిస్తే బహిరంగ శిక్షలు తప్పవు. తాజాగా సౌదీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఓ మహిళ చేసిన పని అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ మహిళ చేసిన తప్పిదమేంటంటే.. కారు నడపడటమే. సౌదీ చట్టాల ప్రకారం అక్కడి మహిళలు డ్రైవింగ్ చేయడం నిషిద్దం. కానీ సదరు మహిళ మాత్రం పురుషుల దుస్తులు ధరించి మరీ కారు డ్రైవ్ చేసింది. ఆమె డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు స్త్రీలు కారు ముందు సీట్లలో ఉండగా, మరో ఇద్దరు పురుషులు కారు వెనక సీట్లలో కూర్చున్నారు.

Woman driver, car owner held in Saudi Arabia

ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లలో ఈ వీడియో వైరల్ అవడంతో.. సౌదీ పోలీసులు మహిళ గురించి ఆరా తీశారు. ఎట్టకేలకు వారి వివరాలు తెలుసుకుని దీనిపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిపై మరో కొత్త కేసు కూడా నమోదవడం గమనార్హం.

సౌదీ చట్టాల ప్రకారం ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఒకచోట చేరడం కూడా నిషేధం. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాదని తెలియడంతో వారిపై మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
Police in Saudi Arabia are questioning four people, two men and two women, for their alleged anti-social behaviour in Al Khafji in the kingdom’s eastern province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X