ఘోరం: ప్రతీకారంతో బాలుడిపై దాడి చేసి కళ్లు పీకేసింది

బీజింగ్: చైనాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ 12ఏళ్ల బాలుడిపై అతి కిరాతకంగా దాడి చేసి కత్తితో గాయపరిచి, అతని కళ్లు పీకేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది.

చైనాలోని ఈశాన్య ప్రాంతం జిలిన్‌ ప్రావిన్స్‌లో రెండు కుటుంబాల మధ్య కలహాలు ఇంతటి దుర్ఘటనకు దారి తీశాయి. ఇందుకు జుహు అనే 12ఏళ్ల బాలుడు బలయ్యాడు. వాంగ్‌ అనే ఇంటిపేరున్న మహిళ.. బాలుడి కుటుంబసభ్యులకు చెందిన దుకాణానికి వచ్చింది.

Woman gauges out eyes of a boy in revenge attack in China

అక్కడే ఆ బాలుడు ఉన్నాడు. బీర్‌ కావాలని అడగగా బాలుడు తెచ్చి ఇచ్చాడు. తర్వాత ఐస్‌క్రీం కావాలని అడిగింది. అతడు తేవడానికి వెనక్కి తిరగగా బాటిల్‌తో కొట్టి కింద పడేసింది. ఆ తర్వాత కత్తితో దాడి చేసి కిరాతకంగా కనుగుడ్లు పీకేసింది.

అనంతరం ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

బర్మాలో 17కి పెరిగిన మృతుల సంఖ్య

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మయన్మార్(బర్మా) అతలాకుతలమైంది. ఖాయ్హ్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగి పడి మృతుల సంఖ్య మంగళవారానికి 17కి చేరగా... మరో ఆరుగురి జాడ తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+