కనీసం పిల్లలైనా ఉంటారని.. కాబూల్ కంచె నుంచి విసిరేస్తోన్న వైనం.. హృదయ విదారకరం..

ఆప్ఘన్‌లో తాలిబన్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. తాలిబన్ల చెర నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. కొందరు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. తాలిబన్లు ఆప్ఘాన్లపై దాడులకు తెగబడుతున్నారు. కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్లకుండా తాలిబన్లు ఇనుప కంచెలను అడ్డుగా పెట్టారు. సరిహద్దుల్లో తప్పించుకునే ప్రయత్నంలో ఆప్ఘన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వారి తల్లులు తమ పిల్లలతో సరిహద్దులను దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇనుప కంచెలు అడ్డుగా ఉండటంతో పిల్లలను ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో బ్రిటీష్ సైన్యం వైపునకు విసిరేస్తున్నారు. తమ పిల్లలను తీసుకెళ్లాంటూ బ్రిటిష్ అధికారులను వేడుకుంటున్నారు. హృదయ విదారక ఘటనలపై బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

Women throw their babies over barbed wire at Kabul airport

ఆప్ఘాన్‌లో చిక్కుకున్న దేశ పౌరులను తరలించేందుకు అమెరికా, యూకే ప్రత్యేక బలగాలను పంపించింది. కాబుల్ ఎయిర్ పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుంది. తాలిబన్ల ఆక్రమణతో భయాందోళనకు గురైన అప్ఘాన్ వాసులు దేశం విడిచి పారిపోతున్నారు. ఆప్ఘన్లంతా ఎయిర్‌పోర్టుకు పరుగులు తీస్తున్నారు. విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని ఆప్ఘాన్ వాసులను అడ్డుకుంటున్నారు. ఇనుప కంచెలను అడ్డుగా పెట్టారు.

ఆప్ఘానిస్తాన్ ప్రజలు బోరుమని విలపిస్తున్నారు. తమను కాపాడాలంటూ యూకే, యూఎస్ బలగాలను వేడుకుంటున్నారు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాంటూ ప్రాధేయపడుతున్నారు. ఆఫ్ఘాన్ వాసుల్లో కొందరు తల్లులైతే ఏకంగా తమ పిల్లలను ఇనుప కంచె నుంచి అవతల వైపునకు విసిరేస్తున్నారు. విదేశీ బలగాలను పట్టుకోమని వేడుకుంటున్నారు. కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుని గాయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషాదకర దృశ్యాలను చూసి తాను చలించిపోయినట్టు బ్రిటీష్ అధికారి ఒకరు తెలిపారు.

తాలిబాన్లు ఆక్రమించారో లేదో.. వారి ఆక్రమణలు, అరాచకాలు కొనసాగుతున్నాయి. కాల్పులు, దాడులకు తెగబడుతున్నారు. దీంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా అక్కడే ఉన్నారు. తమ వారిని స్వదేశం తీసుకొచ్చే సాయం చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+