భారత్ లాంటి దేశాలతో సత్సంబంధాలు మంచికే: ట్రంప్

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: భారత్‌‌తో సత్సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సానుకూలంగా స్పందించారు. భారత్‌, రష్యా, చైనా లాంటి దేశాలతో కలిసి పనిచేయడం చెడు కాదని.. మంచి విషయమేనని ఆయన అన్నారు.

Donald Trump on North Korea ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న ఉ.కొరియా | Oneindia Telugu

అమెరికా, రష్యా మధ్య ఇటీవల విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయినా కూడా రష్యాతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ విధంగా స్పందించారు.

'డ్రీమర్' దెబ్బ: ఈ అమెరికా కోర్టులేంటో అంటూ ట్రంప్ అసహనం

వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌తో కలిసి ట్రంప్ మాట్లాడుతూ.. 'భారత్‌, రష్యా, చైనా లాంటి దేశాలతో కలిసి పనిచేయడం మంచి విషయమే. అందులో ఎలాంటి చెడు లేదు' అని అన్నారు.

'Working with countries like India a good thing', says Trump

తమ దేశం సైనిక పరంగా బలమైనదని, చమురు, గ్యాస్‌ వనరులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కు నచ్చదని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

అయినా ఆయా దేశాలతో పనిచేయడం వల్ల తమకు ప్రయోజనమేనన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో విభేదాల గురించి కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. ఉత్తరకొరియా తమకు సమస్యే కాదని, అది వారి సమస్యేనని అన్నారు. వారే దాన్ని పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పారు.

ట్రంప్ కొడుకు మెగా ప్రాజెక్ట్: గుర్గావ్‌లో ట్రంప్ టవర్స్, 2500కోట్ల లాభం!

కాగా, 2016లో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ బలవంతురాలైన నాయకురాలు కాదని అన్నారు. రష్యాతో తమకు కూడా మంచి సంబంధాలే ఉన్నాయని ఈ సందర్భంగా నార్వే ప్రధాని ఎర్నా చెప్పుకొచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Responding to a question on US desire to improve the relationship with other countries, President Donald Trump has said that working with countries like India, Russia and China is a good, not bad thing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి