వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2022 జనవరి నాటికి ప్రపంచ జనాభా ఎంతో తెలుసా?: 2021లో భారీగా పెరిగిన జనాభా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో అమెరికా సెన్సస్ బ్యూరో జనాభాకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. 2021లో ప్ర‌పంచ జ‌నాభా భారీగా పెరిగిన‌ట్టు పేర్కొంది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేసింది.

2022 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33,24,03,650గా ఉంటుందని పేర్కొంది. 2021 ప్రారంభం నుంచి అమెరికా జనాభాలో 7,06,899(0.21శాతం) పెరుగుదల నమోదు చేసినట్లు తెలిపింది. అమెరికా నేషనల్ సెన్సస్ డే(ఏప్రిల్ 1, 2020) నుంచి చూస్తే ఆ దేశ జనాభా 9,54,369(0.29శాతం) పెరిగినట్లు అధ్యయనంలో పేర్కొంది.

 World population grew by 74 million over past year: US Census Bureau

ఇక 2022 జనవరిలో ప్రతి 9 సెకన్లకు ఒకరు చొప్పున పుట్టనుండగా, ప్రతి 11 సెకన్లకు ఒకరు మరణిస్తారని అంచనా వేసింది. దీంతోపాటు ప్రపంచ దేశాల నుంచి వలస రావడం ద్వారా ప్రతి 130 సెకన్లకు ఒకరు అమెరికా జనాభాకు తోడవుతారని అంచనా వేసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా సంభవించి జననాలు, మరణాలు, వలసల వల్ల అమెరికా జనాభాలో ప్రతి 40 సెకన్లకు ఒకరు చేరుతున్నట్లు తెలిపింది.

కాగా, ప్రపంచ జనాభా 2021లో భారీగా పెరిగిందని అమెరికా సెన్సస్ బ్యూరో అధ్యయనంలో తేలింది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786,88,72,451గా ఉంటుందని అంచనా వేసింది. 2021 జనవరి 1 నుంచి 7,42,35,487(0.95శాతం) జనాభా పెరిగినట్లు వెల్లడించింది. 2022 జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 జననాలు, 2 మరణాలు నమోదవుతాయని అంచనా వేసింది అమెరికా సెన్సస్ బ్యూరో.

English summary
World population grew by 74 million over past year: US Census Bureau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X