Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100 గంటల్లో 10 లక్షలు: 1.40 కోట్ల మందికి మహమ్మరి, కరోనా కరాళ నృత్యం..

కరోనా మహమ్మరి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 100 గంటల్లో అంటే కేవలం 4 రోజుల్లో 10 లక్షల కరోనా వైరస్ కేసులు రికార్డై.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ మొదటి 10 లక్షల కేసులు నమోదయ్యేందుకు మూడు నెలల సమయం పట్టగా.. 14వ మిలియన్ కేసులు నమోదయ్యేందుకు కేవలం 100 గంటలే పట్టింది. ఈ నెల 13వ తేదీన 13 మిలియన్ పాజిటివ్ కేసులు ఉండగా.. మరో మిలియన్ కేసులు చేరడంతో కోటి 40 లక్షల పాజిటివ్ కేసులతో ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 36 లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. గురువారం ఒక్కరోజే 77 వేల కొత్త కేసులు వచ్చి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటు స్వీడన్‌లో కూడా 77 వేల 281 మందికి వైరస్ సోకింది. గత ఏడు నెలల్లో వైరస్ సోకి ఇప్పటివరకు 5 లక్షల 90 వేల మంది చనిపోయారు. కరోనా వైరస్ సోకి జనవరి నెలలో తొలి మరణం చైనాలోని వుహాన్‌లో సంభవించింది.

World Records 1 Million covid Cases in 100 Hours..

చైనా తర్వాత యూరప్, అమెరికాలో వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచంలో సగం వైరస్ కేసులు అమెరికాలో ఉన్నాయి. రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. అధ్యక్షుడు జైర్ బోలో సోనోర్ కూడా వైరస్ సోకింది. బ్రెజిల్‌లోనే 76 వేల మంది చనిపోయారు. భారతదేశంలో గత వారం రోజుల నుంచి సగటున రోజుకు 30 వేల కేసులు నమోదవుతున్నాయి.

Recommended Video

    Rajnath In Leh : 'Talks Are On But Can’t Guarantee Outcome' || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+