వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 వేల మందికి వ్యాక్సిన్: రెండు డోసుల తర్వాత నిశీత పరిశీలన..

|
Google Oneindia TeluguNews

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలను వివిధ అధ్యయన సంస్థలు మరింత ముమ్మరం చేశాయి. సోమవారం అమెరికాలో 30 వేల మంది వాలంటీర్లకు ఓకేసారి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో చాలామందికి చివరి దశ వ్యాక్సిన్ ఇచ్చామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడెర్నా ఐఎన్సీ తెలిపింది. అయితే దీంతో వైరస్ పూర్తిగా నయమవుతోందా అని చెప్పలేమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..

 నిశీతంగా పరిశీలన..

నిశీతంగా పరిశీలన..

వాలంటీర్లకు రెండు డోసులు ఇచ్చిన తర్వాత వారిని నిశీతంగా పరిశీలిస్తున్నారు. అయితే వారిలో ఎవరు ఎక్కువ ఇన్ ఫెక్షన్ వస్తుందో గమనిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు అమెరికాలో అంటువ్యాధులు ఎక్కువగా ఉన్నాయని ఎన్ఐహఎచ్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ అసోసియేటేడ్ ప్రెస్‌కు తెలిపారు. ఇటీవల సవన్నా, జార్జియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టామని వివరించారు. అంతకుముందు 12కు పైగా నగరాల్లో వ్యాక్సిన్ వేశామని తెలిపారు.

ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు..

ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు..

బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, చైనాకు చెందిన వర్సిటీలు కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమ్యాయి. ఇక బ్రెజిల్ అయితే వ్యాక్సిన్ ప్రయోగంలో చివరి దశలో ఉంది. ఇక్కడ కరోనా వైరస్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అయితే అమెరికా మాత్రం సొంతంగా వ్యాక్సిన్ తయారు చేయాలని అనుకొంటుంది. కరోనా వైరస్ అగ్రరాజ్యాంలో ఎక్కువగా ఉండగా ఏకంగా 30 వేల మందిపై ప్రయోగం చేసి.. ముందడుగు వేశారు.

వేసవిలో అందుబాటులోకి..

వేసవిలో అందుబాటులోకి..

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ చివరి ప్రయోగం ఆగస్ట్‌లో పూర్తవుతుండగా.. జాన్సన్ అండ్ జాన్సన్ సెప్టెంబర్, అక్టోబర్‌లో నోవావాక్స్ రానున్నది. ఫైజర్ డాట్ ఇంక్ 30 వేల మందిపై చేసిన ప్రయోగ ఫలితాలు వేసవిలో వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటు భారత్ సహా ఇతర దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. రెండు నుంచి మూడునెలల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
world’s biggest COVID-19 vaccine study got underway Monday with the first of 30,000 planned volunteers helping to test shots created by the U.S.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X