వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదే ప్రపంచంలోని అతి పెద్ద పువ్వు(వీడియో)

|
Google Oneindia TeluguNews

టోక్యో: ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఎంటో తెలుసా? అదే అమర్ఫోఫల్లూస్ టైటానుమ్. దీన్ని టైటాన్ ఆరమ్ అని కూడా అంటారు. ఐదేళ్ల తర్వాత జపాన్ దేశంలో ఈ పువ్వు తొలిసారి పూసింది. ఈ అమర్ఫోఫల్లూస్ టైటానుమ్ టోక్యోలోని చోఫు జిండాయి బొటానికల్ గార్డెన్‌లో పూసింది.

ఆ పార్కులో అతిపెద్దగా ఉన్న ఈ పుష్పం అక్కడి వచ్చిన వారిని ఎంతగానో ఆకర్షిస్తోంది. అంతేగాక, ఆ పువ్వును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సైతం బారులు తీరుతున్నారు. ఆ పువ్వుతో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 World’s largest flower blooms in Tokyo after 5 years

అయితే ఆ పుష్పం నుంచి మాత్రం మాంసం వాసన వస్తుంది. దీంతో పుష్కాన్ని శవ పుష్పం అని కూడా పిలుస్తుంటారు. ఈ పుష్పాలు ఎక్కువగా ఇండోనేషియాలోనే సుమత్ర దీవుల్లోని వర్షపు అడవుల్లో మాత్రమే పూస్తాయి.

కాగా, ప్రస్తుతం ఎక్కువగా లభించని కారణంగా, అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ పుష్పాన్ని అంతరించిపోతున్న పుష్పాల జాబితాలో ఇప్పటికే చేర్చింది.

English summary
Amorphophallus titanum, known as the titan arum the world's largest flower has blossomed for the first time in five years in Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X