వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆ దేశాల వల్లే 3వ, పప్రంచ యుద్దం', 'ట్రంప్ వల్లే రెచ్చిపోతున్న కిమ్'

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆ మూడు దేశాల వల్లే 3వ పప్రంచ యుద్దం జరిగేది ? | Oneindia Telugu

బీజింగ్: ఉత్తరకొరియా, అమెరికాల మధ్య చోటుచేసుకొంటున్న మాటల యుద్దం మూడవ ప్రపంచ యుద్దానికి దారితీసే పరిస్థితులు నెలకొంటున్నాయనే అనుమానాన్ని చైనా వ్యక్తం చేసింది.

ట్రంప్‌కు షాక్: చైనాకు షాకిస్తున్న కిమ్, మళ్ళీ అణుపరీక్షలుట్రంప్‌కు షాక్: చైనాకు షాకిస్తున్న కిమ్, మళ్ళీ అణుపరీక్షలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచదేశాల ఆంక్షలను బేఖాతరు చేస్తూ అణుపరీక్షలు నిర్వహిస్తున్నాడు. కిమ్ వైఖరికి చెక్ పెట్టేందుకుగాను ఉత్తరకొరియాపై భద్రతా మండలి తీవ్రమైన ఆంక్షలను విధించింది.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'

ఈ ఆంక్షలపై ఉత్తరకొరియా తీవ్రంగానే స్పందించింది. అమెరికా అంతుచూస్తామని హెచ్చరికలు జారీ చేసింది.అమెరికా కూడ తీవ్రంగానే స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో తొలిసారిగా ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌పై నిప్పులు చెరిగారు

టెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమేటెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమే

ప్రపంచదేశాల శాంతికి కిమ్ విఘాతం కల్గిస్తున్నాడని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న చైనా మూడువ ప్రపంచయుద్దానికి పరిస్థితులన్నీ దారితీస్తున్నాయా అనే అనుమానాలను వ్యక్తం చేసింది.

 3వ, ప్రపంచ యుద్దమే

3వ, ప్రపంచ యుద్దమే

అమెరికా, ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలు రెచ్చగొట్టే ధోరణిని విడనాడాలని చైనా సూచించింది. .మూడు దేశాలు ఇలాగే రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తే భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని చైనా హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియాపై అంక్షల విధింపు నేపథ్యంలో చైనా అధికార మీడియా గ్జిహయ్‌లో వెలువడిన కథనంలో పై విషయాలను చర్చించింది. ఈ కథనంపై అమెరికా మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

దక్షిణ కొరియా తప్పించుకోలేదు

దక్షిణ కొరియా తప్పించుకోలేదు

దక్షిణకొరియా, అమెరికాలు తమ సమాధుల్ని తవ్వుకునే పనిలో నిమగ్నమయ్యాయని చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉత్తరకొరియా భయంతోనే దక్షిణకొరియా అమెరికా మద్దతు తీసుకుందని ఆరోపించింది. దక్షిణకొరియాలో యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థ ఉన్న ఉత్తరకొరియా దాడి నుంచి తప్పించుకునే అవకాశం లేదని చైనా చెబుతోంది.ఉత్తరకొరియాను ఒంటరి చేసి రెచ్చగొడితే జరిగే పరిణామాలు దక్షిణకొరియాకే ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తోంది.

చర్చలే మార్గం

చర్చలే మార్గం

అమెరికా మద్దతుతో టెర్మినల్ హై అల్టీట్యూడ్ ఏరియా డిఫెన్స్(తాడ్) వ్యవస్థను దక్షిణకొరియాలో నెలకొల్పిన కూడా ఆ దేశ ప్రజలు ఇంకా భయపడుతున్నారంటోంది. ఎన్ని వ్యవస్థలు నెలకొల్పిన ఉద్రిక్తలు సమసిపోవాలంటే మాత్రం చర్చలు జరగాలని చైనా సూచిస్తోంది. అలా జరగాలంటే ఉత్తరకొరియాపై విధించిన అంక్షలు ఎత్తివేస్తే మంచిదని చైనా కోరుతోంది. అదే సమయంలో ఉత్తరకొరియా కూడా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను నిలిపేస్తే మంచిదని హితవు పలికింది.

ట్రంప్ ప్రకటనలతో రెచ్చిపోతున్న కిమ్

ట్రంప్ ప్రకటనలతో రెచ్చిపోతున్న కిమ్

గత కొద్ది నెలల నుంచి ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉత్తర కొరియాను పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేసిన ప్రకటనలతో ఉత్తర కొరియా ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. దీన్ని కిమ్‌ తనకు అనుకూలంగా మలచుకొంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Threating action or rhetoric cannot help resolve the situation on the Korean peninsula, China's foreign ministry said on Tuesday, after U.S. Defense Secretary Jim Mattis hinted about the existence of military options on North Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X