రోజూ తాగే టీతో కరోనా విరుగుడు? వైరస్ విలయాన్ని ఆపేదెలా? మరణాల్లో కొవిడ్-19 శాతం ఎంతంటే..

'చైనా హుటాహుటిన ఆస్పత్రిని నిర్మించిన రోజే కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి ఉంటే ఇవాళ్టి దుస్థితి వచ్చేది కాదేమో' తరహా వాదన రోజురోజుకూ బలపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ జెట్ స్పీడులో వ్యాపిస్తూ వేలమందిని బలితీసుకుంటున్నది. భారతకాల మానం ప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు అన్ని దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 25వేలు దాటింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5.6 లక్షలకు పెరిగింది. అదే సమయంలో రికవరీ అయినవాళ్ల సంఖ్య 1.28 లక్షలుగా ఉంది.

మరణాల్లో కొవిడ్-19 శాతం ఎంతంటే..

మరణాల్లో కొవిడ్-19 శాతం ఎంతంటే..


వరల్డ్ మీటర్ వెబ్ సైట్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి 27 సాయంత్రం 8 గంటల దాకా 1.4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 0.18 శాతం మరణాలు కొవిడ్-19 కారణంగానే సంభవించాయి. కరోనాకు సంబంధించి మొదట్లో తక్కువగా ఉన్న మరణాల రేటు ఇప్పుడు క్రమంగాపెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం మరణాల్లో కొవిడ్-19 శాతం ఇంకా పెరిగే అవకాశముంది.

హైదరాబాద్ లోనూ 24x7 ప్రయోగాలు..

హైదరాబాద్ లోనూ 24x7 ప్రయోగాలు..


ఒకదిక్కు వైరస్ విలయ తాండవం చేస్తున్నా.. సైంటిస్టులు, డాక్టర్లు వంతుల వారీగా అవిశ్రాంతంగా విరుగుడు మందు కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాదాపు అన్ని దేశాల్లో ప్రయోగాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఇన్నోవేషన్ ల్యాబ్, లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేశారు. వైరస్ తో బలంగా పోరాడగలిగిన మొత్తం 31 రకాల రసాయన సమ్మేళనాలను వారు కనిపెట్టారు. తదుపరి పరీక్షల తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

ఎలా నయం చేస్తున్నారంటే..

ఎలా నయం చేస్తున్నారంటే..

కొవిడ్-19కు ప్రత్యేకంగా విరుగుడు మందు కనిపెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతుండగానే.. అందుబాటులో ఉన్న మందుల ద్వారా చికిత్సా విధానాలపై ఎప్పటికప్పుడు వైద్య వర్గాలు అప్ డేట్ అవుతున్నాయి. 1960 నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో ఆరు రకాల కరోనా వైరస్‌లను సైంటిస్టులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, డాక్టర్ల టార్గెట్ ఏంటంటే.. కొవిడ్-19 వ్యాధికి దారితీసే ‘సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2(సార్స్-కోవ్-2)లో.. కైమోట్రిప్సిన్(మానవ జీర్ణగ్రంధిలోని ఒక ఎంజైమ్)ను పొలిన ప్రోటీజ్‌ను నిరోధించడం. దానికి సంబంధించిన వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే, మలేరియా, హెచ్ఐవీ నివారణ కోసం ఇప్పటికే అందుబాటులో మందులతో బాధితుడిలో రోగనిరోధక శక్తిని పెంచుతూ కోలుకునేలా చేస్తున్నారు.

టీలో కరోనా విరుగుడు లక్షణాలు?

టీలో కరోనా విరుగుడు లక్షణాలు?

కొవిడ్-19 వ్యాధికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టనప్పటికీ, విరుగుడు మందుపై సోషల్ మీడియాలో విపరీతంగా పుకార్లు పుడుతున్నాయి. అయితే ఈసారి ప్రఖ్యాత సీఎన్ఎన్ చానెల్.. రోజూ తాగే టీలో కరోనా విరుగుడు లక్షణాలున్నాయంటూ ఓ కథనాన్ని ప్రసారం చేయడం సంచలనం రేపింది. కరోనా వైరస్ ను తొలుత కనిపెట్టి, తర్వాత దానికే బలైపోయిన చైనా డాక్టర్ లీ వెన్లియాంగ్ రాసుకున్న పరిశోధనల నోట్స్ లో ఇది(టీలో కరోనా నయం చేసే లక్షణాలున్నాయని) రాసుందని, ప్రస్తుతం ఆ నోట్స్ తన దగ్గరున్నాయని చైనాకు చెందిన ఓ విజిల్‌బ్లోయర్(రహస్య సమాచారాన్ని రట్టు చేసే వ్యక్తి) పేర్కొన్నాడు. అయితే సీఎన్ఎన్ ప్రసారం చేసిన ఈ కథనం సైటిఫికల్ గా తప్పుడు సమాచారమని తర్వాత తేలింది. ప్రస్తుతానికి సోషల్ డిస్టెన్స్ ద్వారానే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వీలుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+