తప్పు చేయలేదు, అయినా 31 ఏళ్ళపాటు జైలులోనే , అతనేం చేశాడంటే
చేయని తప్పుకు ఏకంగా 31 ఏళ్ళపాటు ఆయన జైళ్లో గడిపారు. నిర్థోషిగా గుర్తించిన తర్వాత ఆయనకు 1 మిలియన్ డాలర్ల పరిహరం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లారెన్స్ కు 75 డాలర్లు మాత్రమే ఇచ్చారు.
అమెరికా :తప్పు చేసిన వారు కూడ తప్పించుకొంటున్నారు.అయితే ఏ తప్పు చేయకున్నా ఏకంగా 31 ఏళ్ళపాటు శిక్షను అనుభవించాడు ఓ వ్యక్తి . అయితే అతను నిర్ధోషిగా తెలడంతో ఆయనకు ఒక్క మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.అయితే పరిహరం చెల్లింపులో కూడ ఆయనకు న్యాయం జరగలేదు.
అమెరికాలోని టెన్నిస్సె రాష్ట్రానికి చెందిన లారెన్స్ మికిన్నే అనే వ్యక్తి 22 ఏళ్ళ వయస్సు ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. 1977 లో ఆయన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరుసటి ఏడాదే అత్యాచారం తో పాటు, దొంగతనం కేసుల్లో దోషిగా తేచ్చిన కోర్టు ఆయనకు 115 ఏళ్ళపాటు జైలు శిక్షను విధించిందిద.

అయితే 2008లో ఆయనకు డిఎన్ ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ కేసులకు లారెన్స్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఆయను నిర్ధోషిగా తేల్చడంతో ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు.
నిర్థోషిగా లారెన్స్ మికిన్నేను నిర్థారించడంతో ఆయనకు 1 మిలియన్ అమెరికన్ డాలర్లను పరిహరంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆయన జైలు నుండి విడుదలయ్యే సమయంలో ఆయనకు 75 డాలర్ల చెక్ ను అందించారు.
అయితే ఈ విషయమై ఆయన న్యాయపోరాటానికి దిగాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు ఇవ్వాల్సిన 1 మిలియన్ డాలర్లను చెల్లించాలని కోరుతున్నాడు. చేయని నేరానికి తన జీవితం సగం జైలులోనే గడిపానని, కనీసం తనకు చెల్లించాల్సిన పరిహరం కోసం కూడ పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు లారెన్స్.












Click it and Unblock the Notifications