Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత సరిహద్దు ఆక్రమణలపై తొలిసారిగా నోరు విప్పిన చైనా అధినేత జిన్‌పింగ్

వాషింగ్టన్: భారత్‌తో పంచుకుంటోన్న వాస్తవాధీన రేఖ, సరిహద్దు వద్ద తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోంది చైనా. లఢక్ సమీపంలోని అక్సాయ్ చిన్, సిక్కిం వద్ద డోక్లాం జంక్షన్, అరణాచల్ ప్రదేశ్ సరిహద్దుల ప్రదేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. తరచూ సరిహద్దులను దాటుకుని, భారత భూభాగంపైకి వస్తుంటుందా దేశ సైన్యం.

ఇదివరకు చైనా విడుదల చేసిన ఓ మ్యాప్.. అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తనలో కలిపేసుకున్నట్లు చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం మొత్తం తమ దేశంలో ఉన్నట్లు చైనా ఖనిజాభివృద్ధి విభాగం ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. తమ దేశ భూభాగం అస్సాం సరిహద్దుల వరకూ విస్తరించినట్టు చూపించింది అందులో.

 Xi Jinping made a key statement on the allegation of occupied foreign land

అక్కడితో ఆగలేదు. కేంద్ర పాలిత పాంతం లఢక్ సమీపంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద గల వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్‌ రీజియన్‌ను కూడా తమ దేశ భూభాగంగా చూపించింది. తైవాన్, దక్షిణ సముద్ర తీరం కూడా తమదేనని తేల్చి చెప్పింది చైనా ఈ కొత్త మ్యాప్ ద్వారా.

గతంలో- ఇలాంటి సందర్భాలు చాలావరకు ఉన్నప్పటికీ.. ఈ సారి మాత్ర దాని తీవ్రత పెరిగింది. ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వివాదాస్పద, ఏ దేశానికీ చెందని భూభాగాన్ని మాత్రమే తమదంటూ క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా మొత్తం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌ రీజియన్‌ను తమదంటూ చెప్పుకొంది.

వీటన్నింటిపై చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్ (Xi Jinping) స్పందించారు. తన మౌనం వీడారు. తొలిసారిగా తన నోరు విప్పారు. తాము విదేశాలకు చెందిన భూమిని ఆక్రమించుకున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఒక్క అంగుళం విదేశీ భూమి (Foreign land)ని కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటైన ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ సదస్సు (APEC Economic summit)కు హాజరయ్యారు. ఈ సదస్సు సైడ్ లైన్స్‌లో భాగంగా యూఎస్- చైనా బిజినెస్ కౌన్సిల్, నేషనల్ కమిటీ ఆన్ యూఎస్- చైనా రిలేషన్స్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు జిన్‌పింగ్.

ఈ సందర్భంగా ఏర్పాటైన కమిటీ భేటీలో ఆయన మాట్లాడారు. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని, అలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించట్లేదని వివరించారు. ఏ ఒక్క దేశానికి చెందిన భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని చెప్పారు. ఎక్కడే గానీ ఆయన భారత్ ప్రస్తావన తీసుకుని రాలేదు.

చైనా ఆవిర్భవించినప్పటి నుంచీ విదేశాలతో సఖ్యతను మాత్రమే కోరుకుంటోందని, ఎలాంటి ఉద్రిక్తతకు అవకాశం లేని విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. యుద్ధాలు, యుద్ధ వాతావరణాన్ని ఏ దేశం కూడా కోరుకోబోదని, ఇతర దేశాలకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారడనంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+