• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యుద్దానికి సిద్దంగా ఉండండి... జిన్‌పింగ్ సంచలన ఆదేశాలు.. మళ్లీ భారత్‌ను టార్గెట్ చేయబోతున్నారా?

|

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఏ క్షణమైనా యుద్దానికి సిద్దంగా ఉండాలని... యుద్దం కోసం పూర్తి స్థాయిలో సన్నద్దమవాలని ఆదేశించారు. భారత్-చైనా సరిహద్దులో సుదీర్ఘ కాలంగా ప్రతిష్ఠంభన నెలకొన్న వేళ జిన్‌పింగ్ ఈ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌తో యుద్దానికి సిద్దపడే చైనా అధ్యక్షుడు తాజా ఆదేశాలు జారీ చేశారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనంతో ఈ విషయం వెలుగుచూసింది.

  Border Tensions:బోర్డర్‌లో ఆర్మీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. కీలక స్థావరాల సందర్శన... ఏం జరుగుతోంది?

  జిన్‌పింగ్ పేరును అత్యంత వల్గర్‌గా.. చైనా అధ్యక్షుడికి ఫేస్‌బుక్ క్షమాపణ..

  జిన్‌పింగ్ ఉత్తర్వుల్లో ఏముంది...

  జిన్‌పింగ్ ఉత్తర్వుల్లో ఏముంది...

  చైనాలో ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త డిఫెన్స్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని ఉద్దేశించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి జిన్‌పింగ్ పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. 'అధికారులు,సైనికులకు మిలటరీలో వాస్తవిక యుద్ద వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇవ్వాలి. యుద్ద పరిస్థితులు,మిలటరీ ఆపరేషన్స్‌పై ఎక్కువ రీసెర్చ్,ఫోకస్ ఉండాలి. శిక్షణను మరింత పదును పెట్టడంతో పాటు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మిలటరీ ప్రతిస్పందనపై వీలైనన్నీ ఎక్కువ డ్రిల్స్ నిర్వహించాలి. సాయుధ బలగాలు ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి.' అని జిన్‌పింగ్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  టెక్+వెబ్ కార్యకలాపాలకు ప్రాధాన్యత..

  టెక్+వెబ్ కార్యకలాపాలకు ప్రాధాన్యత..

  2012 చివరలో సెంటర్ మిలటరీ కమిషన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మిలటరీపై జిన్‌పింగ్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఏ క్షణమైనా యుద్ద రంగంలోకి దిగేలా మిలటరీ శిక్షణా కార్యకలాపాలు ఉండాలని మొదటి నుంచి అధికారులపై ఒత్తిడి తెసతున్నారు. 2015-2020 కాలంలో చైనా మిలటరీని పూర్తిగా ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన తాజా ఉత్తర్వుల్లోనూ మిలటరీలో టెక్నాలజీ ఆధారిత ఆపరేషన్స్ పెరగాలని,ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. మిలటరీ శిక్షణలో టెక్+వెబ్ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

  ప్రత్యర్థులకు యుద్ద సంకేతాలు?

  ప్రత్యర్థులకు యుద్ద సంకేతాలు?

  గతేడాది జూన్‌లో తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకూ సరిహద్దులో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా... గతేడాది తైవాన్‌ టార్గెట్‌గా ఎయిర్‌ఫోర్స్ ఆపరేషన్స్ నిర్వహించింది. అమెరికా నేవీ ప్యాట్రోల్స్‌ను కూడా కౌంటర్ చేసింది. నూతన సంవత్సరంలో ప్రత్యర్థి దేశాలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే దిశగానే జిన్‌పింగ్ తాజా ఆదేశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకరకంగా జిన్‌పింగ్ ప్రత్యర్థులకు యుద్ద సంకేతాలు పంపించాడన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే చైనా మరోసారి భారత్‌ను టార్గెట్ చేయబోతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

  English summary
  In his first order of the new year to the country’s armed forces, Chinese President Xi Jinping stressed the need for “full-time combat readiness” and said the People’s Liberation Army must use frontline frictions to polish troop capabilities.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X